S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/11/2016 - 12:07

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు తనకు నోటీసులు అందలేదని, టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్ తెరాసలో చేరడం విస్మయం కలిగించిందన్నారు. టిఆర్‌ఎస్ నుంచి తనకు ఎటువంటి ఆహ్వానం రాలేదని, ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను టిడిపిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

02/11/2016 - 12:05

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి నూతన మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్ అభ్యర్థిత్వాన్ని కార్పొరేటర్ కవిత ప్రతిపాదించగా, మరో కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా ఫసీయుద్దీన్ పేరును శేషుకుమారి ప్రతిపాదించగా, శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు.

02/11/2016 - 12:04

వరంగల్: 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ వరంగల్ జిల్లాలో ఐటిడిఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్న ఎసిబి అధికారులకు గురువారం ఉదయం పట్టుబడ్డాడు. పలు అవినీతి ఆరోపణలు రావడంతో వెంకన్నపై ఎసిబి అధికారులు నిఘాపెట్టి, పట్టుకున్నారు.

02/11/2016 - 12:02

హైదరాబాద్: జిహెచ్‌ఎంసికి కొత్తగా ఎన్నికైన 150మంది కార్పొరేటర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా వీరిచేత ప్రమాణం చేయించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా హాజరయ్యారు.

02/11/2016 - 12:08

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సియు విద్యార్థులు గురువారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణల్లోని విద్యార్థులను కలుసుకునేందుకు వీరు రెండు బస్సుల్లో బయల్దేరారు. బస్సు యాత్ర ప్రారంభించిన సందర్భంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కాకి మాధవరావు, రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ తదితరులు హాజరయ్యారు.

02/11/2016 - 12:01

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించనున్న నేపథ్యంలో తెలంగాణ సి.ఎం. కెసిఆర్ ఈ రోజు సాయంత్రం దిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, తదితర విషయాలపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. రేపు ఆయన ప్రధాని మోదీని కలుస్తారు. కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లను శనివారం కెసిఆర్ కలుస్తారు.

02/11/2016 - 12:01

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానని మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన బొంతు రామ్మోహన్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలిచిన తెరాస కార్పొరేటర్‌తో గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్‌గా అవకాశం రావడం తన అదృష్టమని, నగరంలో నివసించే అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి కార్యక్రమాలు అందేలా కృషిచేస్తానన్నారు.

02/11/2016 - 08:20

హైదరాబాద్, ఫిబ్రవరి 10: హైదరాబాద్ నగర మేయర్ ఎన్నిక గురువారం జరుగనుంది. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ ఈ మేరకు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.

02/11/2016 - 02:50

సంగారెడ్డి, ఫిబ్రవరి 10: ప్రలోబపెట్టడం, మద్యం తాగించడం, ఒట్టు పెట్టించడం, గూండాగిరి, దాదాగిరితో దౌర్జన్యంగా కొనసాగిన నారాయణఖేడ్ రాజకీయానికి చరమగీతం పాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంటే, నియోజకవర్గాన్ని ఇప్పటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి చేసే బాధ్యత మెదక్ జిల్లా బిడ్డగా తనపై ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు.

02/11/2016 - 02:47

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన వైద్యుల కాల్పుల సంఘటనలో కాల్పులు జరిపిందెవరన్నది తేలిందని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్‌రెడ్డి తెలిపారు. బుధవారం విలేఖరులతో డిసిపి మాట్లాడుతూ హిమాయత్‌నగర్‌లో డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది ఆయన పార్టనర్ డాక్టర్ శశికుమారేనని ప్రాథమిక సమాచారాన్ని బట్టి నిర్ధారణకు వచ్చినట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి వెల్లడించారు.

Pages