తెలంగాణ

కాల్పులు జరిపింది శశికుమారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన వైద్యుల కాల్పుల సంఘటనలో కాల్పులు జరిపిందెవరన్నది తేలిందని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్‌రెడ్డి తెలిపారు. బుధవారం విలేఖరులతో డిసిపి మాట్లాడుతూ హిమాయత్‌నగర్‌లో డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది ఆయన పార్టనర్ డాక్టర్ శశికుమారేనని ప్రాథమిక సమాచారాన్ని బట్టి నిర్ధారణకు వచ్చినట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. హిమాయత్‌నగర్ నుంచి కారులో వెళ్లేటప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉదయ్, పక్క సీట్లో సాయికుమార్ కూర్చోగా..వెనకాల సీట్లో శశికుమార్ కూర్చున్నాడని, చెవి దగ్గర కాల్చే అవకాశం వెనుక కూర్చున్న వాళ్లకే ఉంటుందని, అందువల్ల డాక్టర్ ఉదయ్‌పై కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారేనని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉదయ్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడని, ఆయన పరిస్థితి కొంత మెరుగుపడినా పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని డిసిపి కమలాసన్ రెడ్డి వివరించారు. కాగా శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను నారాయణగూడ పోలీసులు విచారిస్తారని డిసిపి తెలిపారు. చంద్రకళతో పాటు లారెల్ ఆస్పత్రికి చెందిన మిగిలిన డాక్టర్లను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందని, అసలు వైద్యుల వివాదం ఎందుకు వచ్చింది, వాటల వివాదం ఏమిటని విషయాలపై కూడా నారాయణగూడ పోలీసులు తెలుసుకుంటారు. వైద్యుల మధ్య ఏర్పడిన తగాదాపై పూర్తి సమాచారం రాబట్టేందుకు ఒ బృందాన్ని రంగంలో దింపామని త్వరలో శశికుమార్ ఆత్మహత్య, డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై జరిపిన కాల్పుల ఉదంతం తేటతెల్లమవుతుందని డిసిపి కమలాసన్ రెడ్డి వివరించారు.