S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/10/2016 - 04:17

హైదరాబాద్, ఫిబ్రవరి 9: గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు తెదేపాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కుత్బుల్లాపూర్ తెదేపా ఎమ్మెల్యే వివేకానందగౌడ్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. తెదేపా కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపించారు. క్యాంపు కార్యాలయంలో సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో మంగళవారం తెరాస తీర్థం తీసుకున్నారు. ఎమ్మెల్యేకు గులాబీ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు.

02/09/2016 - 11:58

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ రోడ్ నెం.45లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెనుక భాగంలో మంగళవారం ఉదయం మున్సిపల్ అధికారులు గుడిసెలను తొలగించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్నందున వీటిని తొలగించామని అధికారులు తెలిపారు. తాము నిలువనీడ కోల్పోయామని గుడిసెవాసులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

02/09/2016 - 11:56

హైదరాబాద్: ఉదయ్‌కుమార్ అనే డాక్టర్‌పై సోమవారం రివాల్వర్‌తో కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ అదే రోజు రాత్రి మొయినాబాద్ మండలం లక్కపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. శశికుమార్ కోసం గాలిస్తున్న పోలీసులకు ఫామ్‌హౌస్‌లో అతడి మృతదేహం లభించింది. ఉదయ్‌కుమార్‌పై తాను కాల్పులు జరపలేదని, ఆస్పత్రి నిర్మాణానికి తన నుంచి భారీగా పెట్టుబడులు తీసుకున్నారని, ఆయన సూసైడ్ నోట్‌లో రాసినట్టు తెలిసింది.

02/09/2016 - 11:55

హైదరాబాద్: టిడిపికి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ మంగళవారం ఉదయం తెలంగాణ సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వివేక్‌కు కండువా కప్పి పార్టీలోకి కెసిఆర్ ఆహ్వానించారు.

02/09/2016 - 05:20

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితుడైన డాక్టర్ ఒ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాగృతి గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఒఎస్ రెడ్డి సామాజిక, సాంకేతిక రంగాల్లో సెంట్రల్ యూనివర్శిటీల్లో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు.

02/09/2016 - 05:20

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఔషధ రంగంలో హైదరాబాద్ నిర్మాణాత్మక పోషించనుందని పారిశ్రామిక మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఫార్మా రంగంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయని వెల్లడించారు. హైటెక్ సిటీలో సోమవారం నిర్వహించిన బయో ఆసియా -2016 సదస్సును మంత్రి జూపల్లి ప్రారంభించారు.

02/09/2016 - 05:17

హైదరాబాద్, ఫిబ్రవరి 8: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై న్యాయశాఖ లోతుగా అధ్యయనం చేస్తోందని తెలిసింది. 2014 డిసెంబర్ 29న ప్రభుత్వం ఒక జీఓ (జీఓ నెంబర్ 173) జారీ చేస్తూ, ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. డి.వినయ్ భాస్కర్, జలగం వెంకటరావు, వి.

02/09/2016 - 05:10

హైదరాబాద్: తెలంగాణలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాలకు బ్రేక్ పడింది. ఒకవేళ ప్రభుత్వం విసిలను నియమించే పక్షంలో కోర్టు తీర్పునకు లోబడి మాత్రమే చేయాల్సి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది.

02/09/2016 - 03:30

హైదరాబాద్: ఫార్మా కంపెనీలన్నింటినీ ఒకేచోట స్థాపించడానికి వీలుగా ఫార్మా సిటీ నెలకొల్పుతున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఒకేచోట ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడం వల్ల కాలుష్య సమస్యను అధిగమించవచ్చన్నారు. అలాగే ఫార్మాసిటీతోపాటు ఫార్మా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

02/09/2016 - 03:31

హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మిస్తోన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి ఆసక్తి చూపించారు. ఐటి మంత్రి కె తారక రామామారావు సోమవారం ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్ర్తిని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలను కలిసి తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు.

Pages