S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/08/2016 - 04:47

హైదరాబాద్: ఐటి, పంచాయితీరాజ్ శాఖల మంత్రి కె తారక రామారావుకు మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఈ శాఖను ముఖ్యమంత్రే నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలోనే ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్‌కు ఈ శాఖలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. దేశ సగటుకన్నా ఎక్కువగా తెలంగాణలో 42శాతం మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

02/08/2016 - 04:46

హైదరాబాద్: ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ రెండు ప్రాజెక్టులను కలిపి శ్రీరామ సాగునీటి ప్రాజెక్టుగా రీ-డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా రూపకల్పన చేయనున్న శ్రీరామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి రూ. 7,900 కోట్లకు ప్రభుత్వం ఆమోదించింది. సచివాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

02/07/2016 - 21:13

కరీంనగర్-కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో కల్లుతాగిన పదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఉదయం కల్లుతాగిన కూలీలు పనులు చేస్తూ మధ్యాహ్నం అపస్మారక స్థితికిచేరి కిందపడిపోయారు. వీరిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

02/07/2016 - 17:43

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పేద, మధ్యతరగతి వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్న హామీని ఎరగా వేసి తెరాస గెలిచిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో బిజెపి పరాజయానికి దారితీసిన కారణాలను విశే్లషిస్తామని, భవిష్యత్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

02/07/2016 - 08:34

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రయోజనాలను దెబ్బతిసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మరో కుట్రకు తెరలేపారని, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి డింఢి ప్రాజెక్టుకు 60 టిఎం సిల నీటి తరలింపుని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, రాంమోహన్‌రెడ్డిలు తెల్చి చెప్పారు.

02/07/2016 - 08:33

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ వారసుడు కె తారక రామారావే అని నిజామాబాద్ ఎంపి కవిత వ్యాఖ్యానించారు. కెసిఆర్ రాజకీయ వారసుడు కెటిఆర్ అని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారని అన్నారు. మీడియాతో శనివారం కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

02/07/2016 - 08:32

హైదరాబాద్: తెలంగాణలో టిడిపి క్రమంగా కనుమరుగవుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టిడిపికి ఘోర పరాజయం ఎదురు కావడమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతా ల్లో ఫలితాలు ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు తిరుగులేదని టిడిపి ఇప్పటివరకూ విశ్వసిస్తూ వచ్చింది.

02/07/2016 - 08:32

హైదరాబాద్, ఫిబ్రవరి 6: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర అపజయానికి నైతిక బాధ్యత వహి స్తూ, గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఆదివారం పంపనున్నట్లు తెలిపారు. ఇకపై సామాన్య కార్యకర్తగా కొనసాగతానన్నారు.

02/07/2016 - 08:31

నిజామాబాద్: తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో అటు ఆయకట్టు రైతులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోం ది. ఇప్పటికే నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో గత ఖరీఫ్ సీజన్‌లోనూ ఎస్సారెస్పీ ద్వారా పంటలకు సాగు జలాలు అందించలేకపోయా రు.

02/07/2016 - 07:25

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర పోలీసు శాఖలో 510 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అలాగే కమ్యూనిషన్ల శాఖలో ఎస్సై క్యాడర్ 23 పోస్టులు, పోలీసు రవాణా శాఖలో 6 ఎస్సై క్యాడర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు 9281 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

Pages