S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/12/2016 - 07:09

బాసర: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆలయంలోని కొలువుదీరిన శ్రీ జ్ఞానసరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి అమ్మవార్లకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేక అర్చన పూజలు ఘనంగా నిర్వహించారు.

02/12/2016 - 06:55

సదాశివపేట: హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ శిక్షణకు చెందిన హెలిక్యాప్టర్ బీదర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయాన్ని పసిగట్టిన పైలట్ మెదక్ జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో దింపాడు. ఈ సంఘటన గురువారం ఉదయం 9 గంటలకు జరిగింది.

02/12/2016 - 06:51

హైదరాబాద్: చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజనాపై సాలీనా రూ.1050 కోట్ల భారం పడుతుందని, పిపిఏకు వెళ్లే ముందు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో సవరణలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ పి రఘు విద్యుత్ నియంత్రణ మండలిని కోరారు.

02/12/2016 - 06:50

హైదరాబాద్: సినిమా రంగం సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కూడిన ఉప సంఘం తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. 2011 నుంచి ఇప్పటి వరకు నంది అవార్డులను ప్రదానం చేయలేదు.

02/12/2016 - 05:14

డిప్యూటీగా బాబా ఫసియుద్దీన్ ఇద్దరి ఎన్నికా ఏకగ్రీవం నేడు పదవీ బాధ్యతల స్వీకారం
150 మంది కార్పొరేటర్ల పదవీ ప్రమాణం తెరాస అభ్యర్థులకు మజ్లిస్ మద్దతు

02/12/2016 - 04:16

హైదరాబాద్: పార్టీకి ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ఒకవైపు తెదేపా జాతీయ అధ్యక్షుడు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యేల పార్టీ మారడం ఆగడం లేదు. తాజాగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తెరాసలో చేరారు. దీంతో ఇప్పటి వరకు తెదేపానుంచి తెరాసకు వెళ్లిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకుంది. 15మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పదిమంది తెరాసకు వెళ్లిపోయారు.

02/12/2016 - 04:07

హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీని వదిలేసే ప్రసక్తి లేదని జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెదేపా బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తోందన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని, నమ్మకద్రోహులు బయటకు పోయనంత మాత్రాన భయపడాల్సిన పని లేదన్నారు. 34 ఏళ్ల పార్టీలో అన్నీ అనుభవించి బయటకు వెళ్లిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

02/11/2016 - 19:44

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టిడిపి పక్షం నేతగా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఇప్పటివరకూ ఉన్న ఎర్రబెల్లి దయాకరరావు బుధవారం తెరాస పార్టీలో చేరడంతో గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టిడిపి ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. అసెంబ్లీలో తమ నేతగా వారు రేవంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశం మేరకు ఈ ఎన్నిక జరిగింది.

02/11/2016 - 19:41

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినంతమాత్రాన టిడిపికి నష్టమేమీలేదని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టిటిడిపి నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. తెలుగుదేశంలో శ్రేణులు పదిలంగా ఉన్నాయని, వారు ఉన్నంతవరకు పార్టీకి ఢోగా లేదని అన్నారు.

02/11/2016 - 18:02

హైదరాబాద్:సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన నేపథ్యంలో గురువారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశమైంది.

Pages