తెలంగాణ

గ్రేటర్ మేయర్ ఎన్నిక నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: హైదరాబాద్ నగర మేయర్ ఎన్నిక గురువారం జరుగనుంది. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ ఈ మేరకు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 99 డివిజన్లను టిఆర్‌ఎస్ పార్టీ, 44 మజ్లిస్, బిజెపి 4, కాంగ్రెస్ 1, టిడిపి ఒక స్థానాన్ని గెల్చుకున్న సంగతి తెలిసిందే! ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి మొత్తం 217 మంది సభ్యులున్న జిహెచ్‌ఎంసిలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 109 మ్యాజిక్ ఫిగర్ బలం టిఆర్‌ఎస్‌కు ఉన్నది. అంటే మేయర్, డిప్యూటి మేయర్ పదవులను స్వంతంగా గెలుచుకునే బలం టిఆర్‌ఎస్‌కు ఉన్నది.
ఎన్ని గంటలకు..ఎలా?
ఉదయం పదకొండు గంటలకు జిహెచ్‌ఎంసిలోని కౌన్సిల్ హాల్‌లో జరగనున్న మేయర్ ఎన్నికకు సంబంధించి తొలుత ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రకటన చేయగా, అధికార పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు మేయర్ అభ్యర్థిని ప్రతిపాదిస్తారు. ఆ తర్వాత సభ్యులంతా చేయి ఎత్తి తమ ఆమోదాన్ని తెలపటంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ మేయర్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఇదే తరహాలో జరిగే అవకాశముంది. మేయర్ ఎన్నికకు కోరంగా నిర్ణయించిన 109 మంది సభ్యులు ఒకవేళ గురువారం హాజరుకాని పక్షంలో మరుసటి రోజైన శుక్రవారం మరో అవకాశమిస్తారు.
ఎవరి బలమెంత?
జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌లో
మొత్తం సభ్యత్వం 217 మంది
ఎక్స్ అఫీషియో సభ్యులు (ఎంపీలు,
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు) 67
జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ల సంఖ్య 150
ఇందులో టిఆర్‌ఎస్ బలం 99
మజ్లిస్ 44
బిజెపి 4
కాంగ్రెస్ 2
టిడిపి 1
ఎక్స్ అఫీషియో సభ్యులు
టిఆర్‌ఎస్ 35
కాంగ్రెస్ 8
మజ్లిస్ 10
టిడిపి- బిజెపి 14