తెలంగాణ

గ్రేటర్‌పై హైకోర్టుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అధికార దుర్వినియోగం జరిగిందని, మంత్రుల జోక్యం చేసుకున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ జరిగిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. తాము ఈ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించే యోచన చేస్తున్నట్లు టిపిసిసి తెలిపింది. బుధవారం టిపిసిసి సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి, ఎంపి నంది ఎల్లయ్య, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, అధికార ప్రతినిధి జి నిరంజన్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఎన్నికల అవకతవకలపై ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ రోజు టిఆర్‌ఎస్ అభ్యర్ధులకు అనుకూలంగా ఇవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని, దీనికి సంబంధించి రెండు వీడియోల దృశ్యాలను పంపామన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల తీరుపై అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. అన్ని వార్డుల్లో అవకతవకలు జరిగాయన్నారు. జాంబాగ్ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధికి తొమ్మిది ఓట్లు వచ్చాయని, కాని ఈ ప్రాంతంలో రెండు వందల కుటుంబ సభ్యుల ఓట్లు కాంగ్రెస్‌కు పడినా, ఇంత తక్కువ ఓట్లు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియం నుంచి జిహెచ్‌ఎంసి వార్డు ఆఫీసుకు కౌంటింగ్ పూర్తయిన ఇవిఎంలను తరలించడంలో జాప్యం జరిగిందన్నారు. వీటి తాళాలు సీల్ చేయలేదన్నారు. స్టేడియంలో 6వ తేదీన కరెంటు లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్నారు. తమ పార్టీకి వంద సీట్లు రాకపోతే రాజీనామా చేస్తానని మంత్రి కెటిఆర్ ప్రకటించారన్నారు. కాని టిఆర్‌ఎస్‌కు 99 సీట్లు వచ్చాయని, ఇంత కచ్చితంగా ఏ రాజకీయ పండితుడు ఊహించలేరన్నారు. ఇవిఎంల ట్యాంపరింగ్‌లో ఐటి శాఖ మంత్రి అయిన కె టి రామారావు హస్తం ఉందేమోననే అనుమానాలు ఉన్నాయన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో నోటా సదుపాయాన్ని అమలు చేయలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేశారన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేయలేకపోయారన్నారు. సెటిలర్లలో కూడా ఆందోళన కలిగించారన్నారు. అధికారులు పక్షపాత వైఖరితో నడుచుకున్నారన్నారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలు యథేచ్చగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తుంటే, పోలీసులు వారికి రక్షణగా నిలబడ్డారన్నారు. ఇవిఎంలను పరిరక్షించేందుకు సిసిటివిలను అమర్చాలని వారు కోరారు. ఈ ఎన్నికలు సజావుగా జరగలేనందు వల్ల రద్దు చేయాలని వారు కోరారు.