S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/25/2016 - 06:45

హైదరాబాద్, ఏప్రిల్ 24: నామమాత్రంగా కొన్ని కార్పొరేషన్లకు సోమవారం చైర్మన్‌లను నియమించనున్నట్టు తెలిసింది. మొత్తం 40కి పైగా కార్పొరేషన్లు ఉండగా, వీటిలో కొన్నింటికి సోమవారం నియామకాలు చేపట్టనున్నారు. గత ప్లీనరీ సమావేశం సందర్భంగానే నామినేటెడ్ పదవుల పంపకం చేపడతానని ప్రకటించి చేపట్టక వాయిదా వేస్తూ వస్తున్నందున ఈసారి ప్లీనరీ కన్నా ముందే పదవుల పందేరం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

04/25/2016 - 06:44

హైదరాబాద్, 24: వలసలు నిలిచిపోవాలన్నా, వలస వెళ్లిన వారు తిరిగి సొంత గ్రామాలకు రావాలన్నా ప్రాజెక్టులను నిర్మిస్తేనే సాధ్యమని సిఎం కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అనుకున్న విధంగా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు.

04/25/2016 - 00:49

ఖమ్మం, ఏప్రిల్ 24: పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటవుతున్నాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత పోటీలో నిలుస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. సుచరితకు మద్దతు ఇస్తామని గతంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, ఆదివారం టిడిపి కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.

04/24/2016 - 08:15

హైదరాబాద్, ఏప్రిల్ 23: ‘కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారు..’ అనే వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కలకలం సృష్టించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూతగా పార్టీ ఎస్‌సి జాతీయ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు హాజరయ్యారు.

04/24/2016 - 08:12

హైదరాబాద్, ఏప్రిల్ 23:కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ నాయకులు ఏమీ సాధించలేకపోతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు ఏమీ సాధించలేక విఫలం అయిన బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుని బిజెపి నాయకులు మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

04/24/2016 - 08:12

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న కానిస్టేబుల్ ఉద్యోగాల రాతపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1132 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు.

04/24/2016 - 08:11

హైదరాబాద్, ఏప్రిల్ 23: రానున్న ఖరీప్ సీజన్‌లో రైతాంగానికి అవసరమైనన్ని విత్తనాలు, ఎరువులు సమకూర్చేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ఉండాలని తెలంగాణ పొలిటికల్ జెఏసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ డిమాండ్ చేశారు. శనివారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో కరవు, దుర్భిక్ష పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున విత్తనాలు, ఎరువులు రైతులకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

04/24/2016 - 08:11

హైదరాబాద్, ఏప్రిల్ 23: విశ్వవిద్యాలయాల పరంగా పరిశోధనల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో పరిశోధనల్లో 8 స్థానంలో నిలవగా, సైన్స్ పరిశోధనల్లో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉన్నత విద్యాసంస్థల్లో జరుగుతున్న అత్యున్నత స్థాయి పరిశోధనలను పరిశీలించే నేచుర్ ఇండెక్స్ సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని నెంబర్ 1 యూనివర్శిటీగా గుర్తించింది.

04/24/2016 - 08:10

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ వివిధ వడపోతల దశలను దాటి తుది దశకు చేరింది. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్ పోస్టులకు గత ఏడాది సెప్టెంబర్ 23న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 45 పోస్టులకు గానూ 6వేల మంది దరఖాస్తు చేశారు. వీరందరికీ కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్టును గత నవంబర్ 8న నిర్వహించారు.

04/24/2016 - 08:10

హైదరాబాద్, ఏప్రిల్ 23:మిషన్ కాకతీయ పనుల్లో నిర్లక్ష్యం చూపిస్తున్న కాంట్రాక్టర్ సంస్థలను సస్పెండ్ చేసి, ఇతర సంస్థలకు పనులు అప్పగించాలని, నిర్లక్ష్యంగా ఉన్న ఇంజనీర్లకు మెమోలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌కె జోషి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు బదులు శనివారం జోషి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages