S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/23/2016 - 18:12

కరీంనగర్‌: అనవసరపు ఆపరేషన్లు చేసిన జగిత్యాలలో డాక్టర్ టి. సురేష్ కుమార్‌కు చెందిన విజయలక్ష్మీ నర్సింగ్‌‌ హోం, కోరుట్లలోని డాక్టర్ మనోజ్ కుమార్‌ కు చెందిన అయ్యప్ప ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి రాజేషం తెలిపారు.

04/23/2016 - 18:07

హైదరాబాద్: పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరిత పేరును అధికారికంగా ప్రకటించారు. సుచరిత అభ్యర్థిత్వంపై కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సుచరిత విజయానికి ఇతర పార్టీలు సహకరించాలని కోరారు.

04/23/2016 - 17:54

కరీంనగర్: డాక్టర్ల అక్రమ అరెస్ట్‌లను వెంటనే ఆపివేయాలని, రేపు సాయంత్రంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌కు వెనకాడమని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంసుందర్‌ హెచ్చరించారు.

04/23/2016 - 17:52

హైదరాబాద్: దుర్గం చెరువు ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, చెరువు మీదుగా రూ. 184 కోట్లతో 4 లేన్ల సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లతో కూడిన సస్పెన్షన్‌ బ్రిడ్జ్ చేపడతామని మంత్రి కేటీఆర్ శనివారం తెలిపారు. దుర్గం చెరువు ప్రక్షాళనకు పలు కార్పోరేట్ సంస్థలు ముందుకొచ్చాయని, హెరిటేజ్ రాక్‌జోన్‌కు ముప్పు లేకుండా చర్యలు చేపడతామని వివరించారు.

04/23/2016 - 17:43

ఖమ్మం: తెరాస పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న ఖమ్మంలో జరిగే ప్లీనరీకి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్లీనరీ నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం ఇక్కడ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ప్లీనరీ వేదికకు వెళ్లే మార్గంలో పచ్చదనం నిండేలా మొక్కలు నాటుతున్నారు. సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఇతర ప్రముఖులు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.

04/23/2016 - 06:39

హైదరాబాద్, ఏప్రిల్ 22: ‘తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా కలిసి పని చేద్దాం..’ అని పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకులు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కె.

04/23/2016 - 06:39

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగానూ, అత్యున్నత ప్రమాణాలతో అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

04/23/2016 - 06:38

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫస్టియర్‌లోనూ, సెకండియర్‌లోనూ బాలికలు తమ ప్రతిభాపాటవాలు చాటుకున్నారు. సెకండియర్‌లో 67.64 శాతం ఉత్తీర్ణులు కాగా, ఫస్టియర్‌లో 58.9 శాతం మంది ఉతీర్ణులయ్యారు. అదే బాలురు వరకూ తీసుకుంటే సెకండియర్‌లో 58.11 శాతం ఉతీర్ణులుకాగా, ఫస్టియర్‌లో 48 శాతం ఉత్తీర్ణులయ్యారు.

04/23/2016 - 06:37

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడు విడుదల చేశారు. సమగ్ర వివరాలతో కూడిన సిడిని ఆయన ఆవిష్కరించారు.

04/23/2016 - 06:37

హైదరాబాద్, ఏప్రిల్ 22: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య, కేంద్ర మంత్రులు, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.

Pages