తెలంగాణ

ఏకతాటిపైకి విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 24: పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటవుతున్నాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత పోటీలో నిలుస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. సుచరితకు మద్దతు ఇస్తామని గతంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా, ఆదివారం టిడిపి కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో గత ఎన్నికల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒకే బాటపైకి వచ్చినట్లైంది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో 44వేల ఓట్లు సాధించిన సిపిఎం మద్దతు కూడా పొందేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పలుమార్లు చర్చించిన కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వామపక్షాల మద్దతుపై ఆశాభావం వ్యక్తం చేశారు. అదే జరిగితే అధికార పార్టీకి వ్యతిరేకంగా అన్ని ప్రధాన పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చినట్లు అవుతుంది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ఎన్నికలు జరిగినప్పటికీ ఎప్పుడూ ప్రత్యర్థులంతా ఒకే తాటిపైకి రాలేదు. పాలేరు ఉప ఎన్నిక దానికి నాంది కానున్నదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 4వేల ఓట్లు మాత్రమే సాధించిన టిఆర్‌ఎస్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అత్యంత బలమైన పార్టీ గా అవతరించింది. ఇందుకు తుమ్మల వ్యూహ మే ప్రధాన కారణంగా చెప్తున్నారు.