తెలంగాణ

వలసలపై యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, 24: వలసలు నిలిచిపోవాలన్నా, వలస వెళ్లిన వారు తిరిగి సొంత గ్రామాలకు రావాలన్నా ప్రాజెక్టులను నిర్మిస్తేనే సాధ్యమని సిఎం కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అనుకున్న విధంగా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. నిధులు, భూ సేకరణ సమస్యలు లేనందున నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి రైతుల పొలాల్లోకి సాగునీరు పంపాలని అధికారులను ఆదేశించారు. కరవు పీడిత, వలస బాధిత పాలమూరు జిల్లా రైతులకు సాగునీరు అందించడమే మొదటి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం టెండర్లు పూర్తయిన నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించడానికి సిఎం కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు ఏడాదికి 25వేల కోట్లు చొప్పున కేటాయిస్తున్నామని, మంత్రి హరీశ్‌రావు చొరవతో కేంద్రం కూడా దాదాపు మూడువేల కోట్లు మంజూరు చేసినట్టు కెసిఆర్ తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టుల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ప్రతి నెలా 2 వేల కోట్లు విడుదల చేస్తున్నందున నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ 60 శాతం పూర్తయినట్టు చెప్పారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఉద్యోగులు, సిబ్బంది నియామకం, వాహనాల కొనుగోలు, పరికరాల సరఫరా వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలన్నారు. ప్రతి పనికి నిర్ణీత కాల వ్యవధి పెట్టుకొని దానికి అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. అధికారులు తమ వర్కింగ్ ఏజెన్సీల చెక్ లిస్టులు పెట్టుకొని దాని ప్రకారం వెళ్లాలన్నారు. పని పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయవద్దన్నారు. బిల్లుల చెల్లింపులను తాను కూడా ఆన్‌లైన్‌లో గమనిస్తుంటానని చెప్పారు. మిగిలిన భూసేకరణ కూడా త్వరగా పూర్తి చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని ఆదేశించారు. దీనికి కావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంటెక్ వెల్, పంప్ హౌజ్‌లు, రిజర్వాయర్లు, కాలువలు టనె్నళ్ల నిర్మాణం సమాంతరంగా జరగాలన్నారు. వీటికి సంబంధించిన డిజైన్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కాలువల నుండి రిజర్వాయర్లకు నీరు పంపే క్రమంలోనే మధ్యలో ఉన్న చెరువులను కూడా నింపుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. నార్లాపూర్ పంప్ హౌజ్‌తో పాటు కరివెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను 24 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అంతారం రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 15 టిఎంసిలకు పెంచి కేవలం రంగారెడ్డి జిల్లాకు మాత్రమే డెడికేటెడ్‌గా దాని ద్వారా నీరందించాలని చెప్పారు. 16 టిఎంసిల సామర్ధ్యంతో నిర్మించే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా కోస్గి, కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు సాగునీరు అందించాలని చెప్పారు. ఎలక్ట్రో మెకానికల్ డిజైన్ల రూపకల్పన కోసం విద్యుత్, నీటిపారుదల శాఖాధికారులతో కమిటీ వేయాలని చెప్పారు. సాగునీరు అందించే క్రమంలోనే మిషన్ భగీరథకు కూడా నీరు సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 8లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు లాంటి పథకాల పనులు పూర్తి చేయడం ద్వారా మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వీటితో పాలమూరులో మొత్తం 15లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఇవి పూర్తయితే జిల్లాలో వలసలు ఆగిపోతాయి, వలసలు వెళ్లిన వారు తిరిగి సొంత గ్రామాలకు వస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. తమ పొలాలకు నదీ జలాలు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. వారి నమ్మకం నిలబెట్టి తీరాలని రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సమిష్టి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, రంగారెడ్డి , ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి , ఇఎన్‌సి మురళీధర్‌రావు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
chitram...
పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కెసిఆర్