S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/26/2016 - 07:17

నల్లగొండ, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత ముదురుతున్న కొద్దీ పల్లెలు, పట్టణాల్లో మంచినీటి బోర్లు, బావుల్లో నీరు అడుగంటి పోతుండటంతో తాగునీటికి జనం అలమటిస్తున్నారు.

04/26/2016 - 07:41

నిర్మల్ /బాసర, ఏప్రిల్ 25: ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలం బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో మొదటి స్నాతకోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఆరేళ్ల డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందించే కార్యక్రమాన్ని యూనివర్సిటీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు.

04/26/2016 - 07:08

కరీంనగర్, ఏప్రిల్ 25: గత కొన్ని వారాలుగా దంచికొడుతున్న ఎండల దెబ్బకు కరీంనగర్ జిల్లాలో పాల ఉత్పత్తి పడిపోయింది. సుమారు లక్ష లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఓ వైపు ఎండ ప్రచండంతో పాడి పశువులు విలవిల్లాడుతూ ఒత్తిడికి గురవుతుండడం, మరోవైపు నీరు, పశుగ్రాసం కొరత వెరసి పాలఉత్పత్తి పడిపోయింది.

04/26/2016 - 07:06

ధర్మారం, ఏప్రిల్ 25: ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెందిన ఒక యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది.

04/26/2016 - 07:05

చౌటుప్పల్, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం జరిగిన ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఫాస్ట్‌టాగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జిఎంఆర్ అధికారుల తీరుపై మండిపడ్డారు.

04/26/2016 - 07:04

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎంపికకు తెలంగాణ ప్రభుత్వం సెర్చి కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో 94ను సోమవారం నాడు విడుదల చేసింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్, ఇగ్నో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్.పి దీక్షిత్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావులతో ఈ సెర్చి కమిటీని నియమించారు.

04/26/2016 - 07:03

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఎస్‌సిటి సబ్ ఇనె్స్పక్టర్స్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సోమవారం జరిగిన (పిటిఓ, మెన్) రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నగరంలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో 1497 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె పూర్ణచంద్రరావు తెలిపారు.

04/26/2016 - 06:46

ఖమ్మం, ఏప్రిల్ 25: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరగనుంది.

04/25/2016 - 17:55

హైదరాబాద్: ఈ నెల 28న తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగనుంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాజాగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అశోక్ తెరాస వైపు మొగ్గు చూపడంతో పార్టీ ఫిరాయింపుల అంశంపై టి.కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా ఉన్నారు.

04/25/2016 - 16:19

కరీంనగర్: ప్రేమపేరుతో వేధిస్తున్నట్లు తనపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భయపడిన యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుమందు తాగి సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారం పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. రామడుగు మండలం రామచంద్రపురానికి చెందిన వినోద్ ప్రేమపేరుతో కొంతకాలంగా ఓ యువతి వెంట పడుతున్నాడు.

Pages