S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/24/2016 - 08:09

హైదరాబాద్, ఏప్రిల్ 23: అమెరికాలోని సాన్ జువాన్ ప్యూర్టోరికా నగరంలో మే 18 నుంచి 22 వరకు జరిగే స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్ కాంపిటేషన్‌లో పాల్గొనే ముగ్గురు తెలంగాణ విద్యార్థులకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంజూరు చేశారు.

04/24/2016 - 08:08

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ నగరం మీదుగా కలప అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవడానికి నాకాబందీ నిర్వహించాలని అటవీ శాఖ మంత్రి జోగురామన్న అధికారులను ఆదేశించారు. హరిత హారంపై మంత్రి అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. వివిధ జిల్లాల నుండి హైదరాబాద్‌కు ప్రతి రోజూ వందల సంఖ్యలో వాహనాల్లో పలు రకాల కలప చేరుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.

04/24/2016 - 08:08

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టిఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐ) శనివారం నిర్వహించిన ఇంపాక్ట్ కార్యక్రమం విజవంతమైందని ఆ సొసైటీ కార్యదర్శి, ఐపిఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 134 విద్యాసంస్థల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

04/24/2016 - 08:07

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌కి ప్రతిష్టాత్మక హడ్కో అవార్డు లభించింది. నగర ప్రాంతాల్లో వౌళిక వసతుల కల్పన, నిర్వహణకు గాను ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు హడ్కో వెల్లడించింది. అవార్డు రావడం పట్ల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.

04/24/2016 - 08:03

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: ఓ పక్క కృష్ణానది..మరో పక్క తుంగభద్ర నది మధ్యలో నడిగడ్డ ప్రాంతంలోని అమరవాయి గ్రామాన్ని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య ఎడాది క్రితం దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నారు.

04/24/2016 - 08:02

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో గల మారుమూల గ్రామం మొగుల్‌మడక గ్రామం. చదువులో వేళ్లపై లెక్కబెట్టే వారు ఉన్న గ్రామం. గ్రామానికి అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు వెళ్తే జనం ఏం అడుగుతారనే భయం వెంటాడుతూ అధికారిక కార్యక్రమాలు జరిగితే ఎప్పుడు ముగించుకుని వెళ్లిపోదామనే తాపత్రేయం ఉండేది.

04/24/2016 - 08:01

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: రాష్ట్రంలో ఎందరో రాజకీయ నాయకులు, సిని హిరోలు, నటులు, మంత్రులు, వ్యాపారవేత్తలు పబ్లిసిటీ కోసమో లేక జీవితంలో ఏదో ఒక మంచి పని చేసి చూపించాలనే తపనతో తాము ఫలాన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రముఖ సిని నటుడు ప్రకాష్‌రాజ్ గత సంవత్సరం ఆగస్టు మాసంలో దత్తత తీసుకున్నారు.

04/24/2016 - 08:01

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: అదో కుగ్రామం. రాజధానికి కూతవేటు దూరంలోనే ఉన్నా అభివృద్ధికి మాత్రం ఈ గ్రామం ఆమడదూరం. పేరు సిద్దాపూర్. పాలమూరు జిల్లాలో రోడ్డు కూడా లేని, మంచినీటికి అల్లాడే అనేక గ్రామాల్లో ఇదీ ఒకటి. ఇలాంటి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సినీ హీరో మహేశ్‌బాబు ముందుకొచ్చారు. ఈ విషయం తెలియగానే సిద్దాపూర్ గ్రామస్థులు గంతేశారు.

04/24/2016 - 07:49

రామగుండం, ఏప్రిల్ 23: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూనిర్వాసిత కుటుంబాలకు అందజేసే పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి దందా బట్టబయలైంది. న్యాయంగా పొందాల్సిన పరిహారాన్ని ఇక్కడ నిర్వాసితుల ముసుగులో కాజేసిన కోట్ల రూపాయల పరిహారం వ్యవహారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేలతో వెలుగులోకి వచ్చింది.

04/23/2016 - 18:21

హైదరాబాద్: తాము వాడే వాహనాలకు తమకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్లు దక్కించుకోవడంలో తెలుగు సినీహీరోలు జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని విజయం సాధించారు. వీరిద్దరూ శనివారం ఖైరతాబాద్‌లోని ఆర్‌టిఓ కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9999 కోసం రూ.10.5లక్షలు, హీరో అఖిల్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9669కు రూ.41వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

Pages