తెలంగాణ

టి-కాంగ్రెస్‌లో కోవర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ‘కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారు..’ అనే వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కలకలం సృష్టించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూతగా పార్టీ ఎస్‌సి జాతీయ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు హాజరయ్యారు. పార్టీ అధిష్ఠానం ఇటీవలే టిపిసిసి కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మాసాబ్ ట్యాంక్‌లోని ఒక హోటల్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన కార్యవర్గం సాయంత్రం 6.30 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీలో గ్రూపులను కట్టిపెట్టి ఏకతాటిపై నడవడం, ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి హాజరుకాలేదు. ఇలాఉండగా పలువురు నాయకులు తమ ప్రసంగాల్లో పార్టీలో కొంత మంది కోవర్టులు ఉన్నారన్న వ్యాఖ్యలపై సమావేశంలో దుమారం చెలరేగింది. కోవర్టులు కాంగ్రెస్‌లో కొనసాగుతూ, టిఆర్‌ఎస్‌కు అండగా ఉంటున్నారని చేసిన విమర్శలపై మరి కొందరు అభ్యంతరం తెలిపారు. అలా ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తే బహిరంగ పరచాలని, లేదా పార్టీ అధ్యక్షునికి సీల్డ్ కవర్‌లో అందజేయాలని వారు సూచించారు. ఈ అంశంపై వివాదం పెద్దగా అవుతున్నదని భావించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి కల్పించుకుని అటువంటి వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని, ఎవరినీ సహించేది లేదని ఖండితంగా చెప్పారు. అసెంబ్లీలో తమ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా, ఆశించినంతగా ప్రజా సమస్యలను లేవదీయడం లేదని, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం లేదని ప్రజలు బహిరంగంగా అనుకుంటున్నారని వారు తెలిపారు. సిఎల్‌పి నేత కె. జానారెడ్డి స్పందిస్తూ తన శైలిలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో పార్టీ ఎమ్మెల్యేలకూ పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. తన కంటే బాగా ఎవరైనా చేయగలరనుకుంటే వారు ముందుకు రావచ్చని తాను గతంలో కూడా చెప్పానని ఆయన తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి పటిష్టం
ఇలాఉండగా సమావేశానంతరం పార్టీ నాయకులు మల్లు రవి, నాగయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయి, పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి పార్టీని పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చురుకైన 30 మంది కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వారిని పార్టీకి పూర్తి స్థాయి కార్యకర్తలుగా వాడుకోనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలను పార్టీ అధిష్టానానికీ పంపించనున్నట్లు వారు తెలిపారు.
పార్టీ అధికార ప్రతినిధులను 15 మందికి మించకుండా నియమించనున్నట్లు చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకూ టిపిసిసి నేతగా ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పూర్తి అధికారాలను అధిష్ఠానం అప్పగించిందని కొప్పుల రాజు ఈ సమావేశంలో వెల్లడించారని వారు తెలిపారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే..
పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని త్వరలో నియమించనున్నట్లు వారు చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించారు. ఇకమీదట ప్రతి మూడు నెలలకు ఒకసారి పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు.

చిత్రం టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సిఎల్‌పి నేత జానారెడ్డి