S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/25/2016 - 16:19

హైదరాబాద్: ఏళ్లతరబడి కొనసాగుతున్న విలువలకు, సంప్రదాయాలకు అధికార తెరాస నేతలు నీళ్లొదులుతున్నారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు పోటీ పెట్టకపోవడమనే సంప్రదాయాన్ని తెరాస పాటించకపోవడం సబబుకాదన్నారు.

04/25/2016 - 14:06

హైదరాబాద్: సిద్ధాంతాలు, కార్యకర్తలే తమ పార్టీకి అండగా ఉంటాయని బిజెపి తెలంగాణ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణలో పార్టీని నడిపిస్తానన్నారు. కేంద్రం ఎంతగా సాయం చేస్తున్నా హామీలను అమలు చేయడంలో తెరాస సర్కారు విఫలమవుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు.

04/25/2016 - 12:33

కరీంనగర్: దండేపల్లి మండలం కనే్నపల్లి వద్ద సోమవారం ఉదయం టిప్పర్‌ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. బైక్ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

04/25/2016 - 12:33

హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఎం చౌనీలో గౌసియా బేగం, ఆమె కుమార్తె రుక్సానా బేగం హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగుచూసింది. గౌసియా భర్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.

04/25/2016 - 08:39

హైదరాబాద్, ఏప్రిల్ 24:రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో మండుతున్న ఎండలు, మంచినీటి కొరత, కరవు విలయ తాండవంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లతో ఈనెల 29న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష జరుపుతారు. గోదావరి జలాలను సకాలంలో తీసుకు రావడంతో హైదరాబాద్‌లో నీటి కొరతను కొంత వరకు తీర్చినా, గ్రామాల్లో మాత్రం మంచినీటి సమస్య చాలా ఉంది.

04/25/2016 - 08:29

ఖమ్మం, ఏప్రిల్ 23: గ్రామాలను ప్రముఖులు ‘దత్తత’ తీసుకుంటే సమస్యలు మటుమాయం అవుతాయని జనం నమ్మారు. కాదు... కాదు ‘దత్తత’ వేళ ఆయా నాయకులు అలా ‘నమ్మబలికారు’. నాయకుల మాటలను మామూలుగానే నమ్మిన జనం ‘నిజమే కాబోల’ని కలలుగన్నారు. వాస్తవానికి వచ్చేసరికి అది ఒట్టి ‘పొల్లే’నని తేలిపోయింది.

04/25/2016 - 08:15

హైదరాబాద్, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనా పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని పాలేరు ఎన్నికల ఇంచార్జి, మంత్రి కె తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొనసాగుతున్న విజయపరంపర పాలేరులో కూడా పునరావృతం అవుతుందని ఆయన అన్నారు.

04/25/2016 - 08:13

ఖమ్మం, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం శాసనసభ్యుడు పువ్వా డ అజయ్‌కుమార్ అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆయన విలేఖరులతో మా ట్లాడుతూ రెండేళ్ళపాటు ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ఒంటరిగా ప్రయత్నించానన్నారు.

04/25/2016 - 06:49

వికారాబాద్, ఏప్రిల్ 24: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న తాండూర్ డిపోకు చెందిన టిఎస్ 07ఎ 5288 ఎక్స్‌ప్రెస్ బస్సును వికారాబాద్ వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఎపి 22 డబ్ల్యు 5243 టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలు కాగా మరో 24 మంది స్వల్పంగా గాయపడ్డారు.

04/25/2016 - 06:50

జల విద్యుత్ ఆశలు అడియాసలయ్యాయి. జెన్కో పరిధిలోని రెండు యూనిట్లలో యంత్రాలు మొరాయంచాయ. విభజన చట్టంలో నిర్దేశించినట్టు విద్యుత్ వాటా ఇవ్వలేమని ఆంధ్ర తెగేసి చెప్పింది. సీలేరు విద్యుత్‌లోనూ మొండి చెయ్యి చూపింది. ఉమ్మడిలోని పిపిఏలు చెల్లవని తేల్చేసింది. కృష్ణపట్నం వాటా రాలేదు. ఇన్ని కష్టాల్లోనూ రాష్ట్రంలో క్షణకాలం కరెంట్ కట్ కాలేదు. కారణం ముందుచూపు విద్యుత్ కొనుగోళ్లే.

Pages