S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/26/2016 - 17:54

హైదరాబాద్: రాష్టమ్రంత్రుల శాఖల మార్పులకు సంబంధించి అనవసర వ్యాఖ్యానాలు వద్దని తెరాస ఎంపి కవిత అన్నారు. ఆమె మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తెరాస పార్టీకి కెటిఆర్, హరీష్ రావు సమానమేనన్నారు. బంగారు తెలంగాణ సాధించడమే తమందరి ధ్యేయమన్నారు. కాగా, పాలేరు ఉపఎన్నికలో తెరాస అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్, టిడిపి చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు.

04/26/2016 - 17:45

హైదరాబాద్‌ : సరూర్‌నగర్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వేణుగోపాలరావు మంగళవారం ఓ వ్యక్తి నుంచి రెండువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

04/26/2016 - 17:43

హైదరాబాద్ : తెలంగాణలో పలు చోట్ల ఈదురుగాలు, వడగండ్లతో కూడిన వర్షాలు మంగళవారం బీభత్సం సృష్టించాయి. శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్‌లో పాతబస్తీ, ఎల్బీనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌తో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. మెదక్ జిల్లా దుబ్బకలో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది.

04/26/2016 - 17:20

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఈదురుగాలులతో వర్షం పడింది. చంపాపేట్‌, సైదాబాద్‌ సహా దిల్‌సుఖ్‌నగర్‌, పాతబస్తీ, వనస్థలిపురం ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. వాతావరణo చల్లబడటంతో కాస్త వూపిరి పీల్చుకున్నారు.

04/26/2016 - 17:01

హైదరాబాద్: టి.సచివాలయంలో సీ బ్లాక్‌ ఎదుట రాజు అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అధికారిని కలవడానికి వచ్చిన ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. వెంటనే అతన్ని అస్పత్రికి తరలించారు.

04/26/2016 - 16:00

హైదరాబాద్: వ్యాపారులు, అధికారులను పలురకాలుగా వేధింపులకు గురిచేసిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నుంచి వాణిజ్యపన్నుల శాఖను తీసివేయడం మంచి నిర్ణయమని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి తలసానిని తప్పించినందుకు వ్యాపారుల తరఫున సిఎం కెసిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

04/26/2016 - 15:59

హైదరాబాద్: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి ప్రభాకరరావును తెలంగాణ సర్కారు నియమించింది. క్యాబినెట్ హోదా ఉన్న ఈ పదవిలో ఆయన ఏడాదిపాటు కొనసాగుతారు. దేవులపల్లి నియామకంతో తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది.

04/26/2016 - 15:57

తిరుపతి: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 18కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని, వచ్చే నెలలో శంకుస్థాపన చేయించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. ఇక్కడ మంగళవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమల ఆలయంలో నగలు, వివిధ వస్తువుల తయారీకి భారీగా నిధులు కేటాయించారు.

04/26/2016 - 15:57

హైదరాబాద్: తెలంగాణలో దుర్భిక్ష పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ రైతులకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పిఎల్ విశే్వశ్వరరావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో మంగళవారం ఫిర్యాదు దాఖలు చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులిచ్చినా వాటిని ఖర్చు చేయడం లేదన్నారు.

04/26/2016 - 14:46

హైదరాబాద్: తెరాసలో చేరే ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేలా అధికార తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పేరోజు తొందరలోనే వస్తుందన్నారు.

Pages