తెలంగాణ

నేడు కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు రాతపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న కానిస్టేబుల్ ఉద్యోగాల రాతపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1132 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయని బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. 5.36 లక్షల మంది అభ్యర్థులు పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న 9,281 కానిస్టేబుల్ ర్యాంక్ ఉద్యోగాలకు పోటీపడనున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామని, పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు అభ్యర్థి వేలిముద్రను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గంట ముందుగా అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేమని స్పష్టం చేశారు. పరీక్ష మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని బోర్డు చైర్మన్ వెల్లడించారు. అభ్యర్థులు తమ వెంట ఒక సెట్ దరఖాస్తు ఫారం అటెస్టేషన్ చేయించుకుని పరీక్షా కేంద్రానికి తీసుకు వచ్చి ఇన్విజిలేటర్‌కు అందజేయాలని సూచించారు.