తెలంగాణ

రానున్న ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు సమకూర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: రానున్న ఖరీప్ సీజన్‌లో రైతాంగానికి అవసరమైనన్ని విత్తనాలు, ఎరువులు సమకూర్చేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ఉండాలని తెలంగాణ పొలిటికల్ జెఏసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ డిమాండ్ చేశారు. శనివారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో కరవు, దుర్భిక్ష పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున విత్తనాలు, ఎరువులు రైతులకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. జెఏసి తరఫున నెలకొన్న కరవు పరిస్థితులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు కోదండరామ్, తదితరులు నివేదిక రూపంలో అందజేశారు. కరవు పరిస్థితుల కారణంగా పశువులు చనిపోతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతి రైతుకు రూ.10 వేల పరిహారం అందించాలని కోరారు. గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు మధ్యాహ్నా భోజనం అందించే పథకాన్ని వర్తింప చేయాలని కోరారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లిక్కర్ కంపెనీలకు ప్రభుత్వం మంచినీటి సరఫరా చేయకూడదని డిమాండ్ చేశారు.