S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/29/2015 - 05:01

డిసెంబర్ 7 తుది గడువు
సిపిఐ నేత రామకృష్ణ హెచ్చరిక

11/28/2015 - 18:52

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్ జిల్లా గట్టాకాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మరో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

11/28/2015 - 18:51

ఢిల్లీ : షీనాబొరా హత్యకేసులో ప్రముఖ వ్యాపారవేత్త పీటర్‌ ముఖర్జీకి ముంబయి ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు శనివారం లైడిటెక్టర్‌ పరీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలో పీటర్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

11/28/2015 - 15:37

లక్నో : ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాకిస్థాన్ గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ఈజజ్ అలియాస్ మహ్మద్ కలాంను ఇర్ఫానాబాద్, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. యూపీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా అతనిని అరెస్టు చేశారు. అతడిని ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పోలీసులు భావిస్తున్నా

11/28/2015 - 15:33

చెన్నై : ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో తమిళనాడులోని రామనాథపురం జిల్లా సముద్ర తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నై నుంచి పెద్ద యుద్ధనౌకను కూడా రామేశ్వరం తీరానికి పంపించాయి. కోస్ట్ గార్డు దళాలు బోట్లలో గస్తీ కాస్తున్నాయి.

11/28/2015 - 15:24

ఢిల్లీ : మ్యాగీ పాస్తాలో సీసం శాతం అధికంగా ఉందని వస్తున్న వార్తల్ని నెస్లే సంస్థ ఖండించింది. మ్యాగీ పాస్తా తినేందుకు 100శాతం సురక్షితమైనదని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. నాణ్యమైన ముడి సరుకుని ఉపయోగించి వాటిని తయారు చేస్తామని, ప్రమాణాల విషయంలో రాజీ పడమని తెలిపింది.

11/28/2015 - 14:06

ఢిల్లీ :జర్నలిస్టులకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. దివాలీ మిలన్ పేరుతో ఈ విందును ఏర్పాటుచేశారు.

11/28/2015 - 06:28

న్యూఢిల్లీ, నవంబర్ 27: అత్యవసర పరిస్థితి విధించి ప్రాథమిక హక్కులతో పాటు చివరికి జీవించే హక్కును కూడా హరించివేసిన సం ఘటనలు పునరావృతం కాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకున్న అధికారంతో రాజ్యాంగానికి కళంకం తెచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగాఉండాలన్నారు.

11/28/2015 - 06:25

న్యూఢిల్లీ, నవంబర్ 27: పార్లమెంటులో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఆమోదానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే పరిణామాలు శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నాయి.

11/28/2015 - 06:24

న్యూఢిల్లీ, నవంబర్ 27: స్వాతంత్ర పోరాటంలోనే కాక ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాజ్యాంగం రూపొందించడంలో కీలక పాత్ర వహించిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్, వౌలానా ఆజాద్ వంటి ప్రముఖలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు.

Pages