S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/28/2015 - 05:07

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసిహెచ్‌ఆర్) చైర్మన్‌గా నియమితులై 16 నెలలు తిరక్కముందే యల్లాప్రగడ సుదర్శన రావు‘వ్యక్తిగత కారణాల’పై ఆ పదవికి రాజీనామా చేశారు. సుదర్శన రావుకు నెలకు లక్షన్నర రూపాయల గౌరవ వేతనం మంజూరు చేయాలన్న ప్రతిపాదనను మానవ వనరుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

11/28/2015 - 03:48

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక ఆదర్శాలకు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటామని లోక్‌సభ ప్రతిన చేసింది. రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని, పవిత్రతను పరిరక్షిస్తామని, దాని ఆదర్శాలు, నియమ నిబంధనల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తామని ముక్తకంఠంతో ఉద్ఘాటించింది.

11/28/2015 - 03:46

న్యూఢిల్లీ, నవంబర్ 27: తమ ప్రభుత్వానికి భారతీయతే ఏకైక మతమని, రాజ్యాంగమే ఏకైక పవిత్ర గ్రంథమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు నిబద్ధతతో కృషి చేస్తామన్నారు.

11/28/2015 - 03:44

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఆంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించే విషయంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఐదేళ్లుకాక పదేళ్లపాటు ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తామని ప్రకటించామని ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ అన్నారు.

11/28/2015 - 03:36

చింతూరు, నవంబర్ 27: ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య నువ్వా నేనా? అన్న చందంగా పోరు సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో అరణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది. మావోయిస్టు నేతలే లక్ష్యంగా పోలీసులు అరణ్యాన్ని అణవణువూ జల్లెడపడుతున్నారు.

11/27/2015 - 16:58

ఢిల్లీ: ఢిల్లీ:లో నిన్న అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అఖిలేశ్‌ త్రిపాఠికి బెయిల్‌ లభించింది. 2013 అల్లర్లకు సంబంధించిన కేసులో నిన్న దిల్లీ పోలీసులు అఖిలేశ్‌ను అరెస్టు చేశారు. రూ.10వేల పూచీకత్తుతో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కపిల్‌ కుమార్‌ ఎమ్మెల్యేను విడుదల చేశారు.

11/27/2015 - 16:54

ఒడిశా : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు సామర్థ్యం గల అగ్ని-1 క్షిపణిని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్‌లో అబ్దుల్‌కలాం ద్వీపంలోని నాలుగో లాంచ్‌ప్యాడ్‌ నుంచి రక్షణ శాఖ అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. భూఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి 700కి.మీల దూరంలో లక్ష్యాన్ని ఛేదించింది.

11/27/2015 - 15:26

న్యూఢిల్లీ: డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం వారం రోజుల్లోగా సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కాగా, టెలికాం కుంభకోణం కేసులో మారన్ ఆరోపణలు ఎదుర్కొంటోన్నన విషయం తెలిసిందే.

11/27/2015 - 12:52

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డైరెక్టరేట్ నుంచి తాఖీదులందాయి. మనీలాండరింగ్ కేసులో విచారణకు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా, మనీల్యాండరింగ్ కేసులో వీరభద్రసింగ్‌కు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

11/27/2015 - 12:43

ఢిల్లీ: ప్రభుత్వం అన్ని అంశాలకు సమాధానం ఇస్తుందని, ప్రతి అంశాన్ని పార్టీలు రాజకీయం చేయడం సరికాదని కేంద్రమంత్రి వెంకయ్య పేర్కొన్నారు. రెండో రోజూ ఆరంభమైన సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని స్పంచడంలేదంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్యసింధియా సంధించిన ప్రశ్నకు కేంద్రమంత్రి వెంకయ్య సమాధానం చెప్పారు.

Pages