S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/26/2015 - 18:32

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎవర్నీ దూషించాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము విభజనను కోరలేదంటూ లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు చేసిన వ్యాఖ్యలపై జితేందర్ స్పందించారు.

11/26/2015 - 18:31

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని తాము కోరలేదని... గత ప్రభుత్వం విభజించిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు.

11/26/2015 - 18:18

న్యూఢిల్లీ: షీనాబోరా హత్యకేసులో నిందితుడు స్టార్‌ఇండియా మాజీ సీఈవో పీటర్‌ముఖర్జియా సీబీఐ కస్టడీని కోర్టు నవంబర్ 30వరకు పొడిగించింది. షీనాబోరా హత్య కేసులో పీటర్‌ముఖర్జియాను ప్రశ్నించేందుకు కస్టడీని మరో 7రోజులు పొడిగించాలని సీబీఐ కోర్టును కోరింది.

11/26/2015 - 16:37

న్యూఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని పార్లమెంట్‌ ఆవరణలో ఓ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌లు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్రమోదీ ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

11/26/2015 - 16:07

కోల్ కతా: భారత్ లో అసహన పరిస్థితులున్నాయంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమర్థించారు. గురువారం ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక భారతీయుడిగా ఆయన ఎలా ఫీలయ్యారో అదే విషయాన్ని ఆమిర్ చెప్పారని అన్నారు. అసలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరు అంటూ ఆయనను నిందించిన వారిని ప్రశ్నించారు.

11/26/2015 - 16:00

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ పార్టీ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 2013లో ఆదర్శ్‌నగర్‌లో జరిగిన ఓ అల్లర్ల కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు.

11/26/2015 - 16:00

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో జరిగే చర్చల పట్ల ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక బిల్లులు పార్లమెంట్‌ పరిశీలనకు రానున్నాయని, పార్లమెంట్‌ ప్రతిష్ఠంభనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

11/26/2015 - 14:16

న్యూఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోకసభలో భారత రాజ్యాంగం-కట్టుబాట్లపై ఆయన ప్రసంగించారు. డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం ఈరోజు, రేపు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... భారత రాజ్యాంగం- కట్టుబాట్లపై రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడతూ అంబేద్కర్ దూరదృష్టి ఉన్నతమైనదని కొనియడారు.

11/26/2015 - 14:12

న్యూఢిల్లీ : రాజ్యసభ శుక్రవారానికి వాయిదాపడింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కు రాజ్యసభ ఘన నివాళి అర్పించింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

11/26/2015 - 14:02

పాట్నా : సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా బీహార్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఆయన గత జూలైలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిషేధం వచ్చే ఏడాది (2016) ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు నితీశ్ కుమార్ గురువారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Pages