జాతీయ వార్తలు

రాజ్యాంగమే సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక ఆదర్శాలకు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటామని లోక్‌సభ ప్రతిన చేసింది. రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని, పవిత్రతను పరిరక్షిస్తామని, దాని ఆదర్శాలు, నియమ నిబంధనల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తామని ముక్తకంఠంతో ఉద్ఘాటించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పీఠికపై జరిగిన రెండు రోజుల చర్చ ముగింపు సందర్భంగా శుక్రవారం ఈ మేరకు ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడంతో పాటు వాటి స్వేచ్ఛ, ఆధికారాలకూ బద్ధులమవుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానంలో స్పష్టం చేశారు. ప్రజాజీవితంలో పారదర్శకత, నిజాయితీ, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తామని తెలిపింది. సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు కట్టుబడి ఉండటంతో పాటు భరతావనని శక్తివంతమైన గణతంత్ర దేశంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తామని ఈ తీర్మానం ద్వారా సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.