S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/30/2015 - 06:03

శ్రీనగర్/న్యూఢిల్లీ, నవంబర్ 29: పాకిస్తాన్ వైపునుంచి చొరబాట్లు హటాత్తుగా పెరగడం, గత పది వారాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లు 20నుంచి 25 మంది దాకా ఉగ్రవాదులను కాశ్మీర్‌లోకి పంపించినట్లు అనుమానిస్తుండడంతో కాశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలను పూర్తిగా అప్రమత్తం చేసారు.

11/30/2015 - 06:02

న్యూఢిల్లీ, నవంబర్ 29: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తప్పు చేసిన కంపెనీల ఉత్పత్తులను వాపసు తీసుకోవడం, వాటి లైసెన్సులు రద్దు చేయడం వాటిపై కేసులు పెట్టడం లాంటి అధికారాలు కలిగిన ఒక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లు మరింత ఆలస్యం కానుంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ గడువును వచ్చే ఏడాది పార్లమెంటు సమావేశాల దాకా పొడిగించడమే దీనికి కారణం.

11/30/2015 - 06:00

ముంబయి, నవంబర్ 29: మహారాష్టల్రో ఒక మహిళ పురాతన సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రముఖ దేవాలయంలో ప్రవేశించి పూజలు నిర్వహించింది. అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో గల షానీ పుణ్యక్షేత్రంలో ఆమె ఈ చర్యకు పాల్పడి ఆ దేవాలయంలో మహిళల ప్రవేశంపై ఎన్నో ఏళ్లనుంచి కొనసాగుతున్న నిషేధాన్ని ఉల్లంఘించింది. శనివారం బ్యారికేడ్‌ను దూకి ఆలయంలో ప్రవేశించిన ఆమె మూలవిరాట్టుకు పూజలు నిర్వహించింది.

11/30/2015 - 04:59

న్యూఢిల్లీ, నవంబర్ 29: భూగోళం వేడెక్కకుండా చూడాలంటే ఇంధన పొదుపు ఒక్కటే సరైన మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు చెప్పారు. మోదీ ఆదివారం ఆకాశవాణిలో పధ్నాల్గవ ‘మనసులోని మాట’ ప్రసంగం చేస్తూ ఈ విషయం చెప్పారు. వాతావరణం మారిపోతోంది, భూగోళం వేడెక్కిపోతోంది, దీనివలన మానవాళికి పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన హెచ్చరించారు.

11/30/2015 - 04:53

శ్రీనగర్/న్యూఢిల్లీ, నవంబర్ 29: పాకిస్తాన్ గూఢచార ఏజన్సీ ఐఎస్‌ఐ మద్దతుతో దేశంలో గూఢచర్యం నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేయడమే కాక ఆ సంస్థకు చెందిన కార్యకర్తను, సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్)కు చెందిన ఓ జవానును అరెస్టు చేసారు.

11/30/2015 - 03:04

న్యూఢిల్లీ, నవంబర్ 29: భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రాజ్యాంగంపై చర్చతో ప్రారంభమైనప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అసలైన యుద్ధం నేటినుంచి ప్రారంభం కాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన జిఎస్టీ బిల్లు సహా అనేక కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కార్ గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో అది ఎంతవరకూ సాధ్యమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

11/30/2015 - 04:22

న్యూఢిల్లీ, నవంబర్ 29: శ్రేయో, శ్రేష్ఠ, ఆదర్శ భారతమే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశ సమైక్యత, సామరస్య సాధన కోసం ప్రతి ఒక్కరినీ మమేకం చేయడానికి ఇందుకు సంబంధించి విశిష్ట పధకాన్ని తీసుకురావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

11/29/2015 - 07:20

జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి జెఏసి నిరసన

11/29/2015 - 07:15

విధాన మండలి ఎన్నికల్లో పోటీపై సిపిఐ కార్యదర్శి చాడ వెల్లడి

11/29/2015 - 06:57

‘ఆర్గనైజర్’ పత్రిక వ్యాసంపై మండిపడ్డ కేరళ సిఎం * బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్

Pages