S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/30/2015 - 14:12

బీహార్ : బీహార్ :లో నూతనంగా ఎన్నికైన ఆర్‌ఎల్‌ఎస్పీ ఎమ్మెల్యే బసంత్‌ కుశ్వాహా(54) సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎన్డీయే కూటమిలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో గెలుపొందగా, అందులో ఒకటి బసంత్‌ కుశ్వాహాది.

11/30/2015 - 13:42

న్యూఢిల్లీ : సీపీఎం సభ్యుడు సలీం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలపై లోకసభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సలీం వ్యాఖ్యలపై బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

11/30/2015 - 13:42

బీహార్ : కొత్తగా కొలువుదీరిన బీహార్ అసెంబ్లీలో ఆర్జేడి శాసనసభాపక్ష నేతగా లలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‌ను ఎన్నుకున్నారు. బీహార్‌లో 243 స్థానాలు ఉండగా ఆర్జేడీ 80 స్థానాలను గెలుచుకున్నా విషయం విదితమే. ఉభయ సభలలో పార్టీ నాయకురాలుగా లలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి ఎన్నికయ్యారు.

11/30/2015 - 13:40

న్యూఢిల్లీ : అసహనంపై మాట్లాడుతూ సీపీఎం సభ్యుడు సలీం చేసిన వాఖ్యలపై లోకసభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. సలీం తనపై విమర్శలు చేశారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తంచేయటంతో పాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని ఎవరిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని సీపీఎం సభ్యుడు సలీంకు హితవు పలికారు.

11/30/2015 - 13:40

న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న అసహనం ఘటనలు చిన్న విషయాలు కావని సీపీఎం సభ్యులు సలీం అన్నారు. ఆయన పార్లమెంట్‌లో అసహనం అంశంపై మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అవి ప్రామాణికం కాదని, దేశం బహుళత్వం ప్రాతిపదికగా ముందుకు సాగాలని అన్నారు.

11/30/2015 - 13:39

న్యూఢిల్లీ : వైద్య పరీక్షల కోసం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. వారం రోజుల తర్వాత ఆమె భారత్‌కు తిరిగి వస్తారు.

11/30/2015 - 13:38

న్యూఢిల్లీ : రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరేందుకు ప్రతి సభ్యుడు కృషిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యసభలో ఆయన రాజ్యాంగం అనే అంశంపై మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు కన్న కలలు సార్థకం చేస్తున్నామా లేదా అని సమీక్షించుకోవాలన్నారు.

11/30/2015 - 13:38

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. అసహనంపై చర్చ జరగాలని కాంగ్రెస్, సిపిఎం నోటీసులు ఇచ్చాయి. ఉభయ సభల్లోనూ ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది. లోకసభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

11/30/2015 - 06:07

భువనేశ్వర్, నవంబర్ 30: ప్రజల రాష్టప్రతిగా ఘనమైన ప్రతిష్టను సంతరించుకున్న అబ్దుల్ కలాం ఒక దశలో ఈ సమున్నత రాష్టప్రతి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన ప్రెస్ కార్యదర్శిగా పనిచేసిన ఎస్.ఎం.ఖాన్ వెల్లడించారు. బిహార్ అసెంబ్లీ రద్దును సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్టప్రతి పదవికి రాజీనామా చేయాలని కలాం నిర్ణయించుకున్నారని ఖాన్ తెలిపారు.

11/30/2015 - 06:06

న్యూఢిల్లీ, నవంబర్ 29: వాతావరణ మార్పులపై పారిస్‌లో సోమవారం ప్రారంభం కానున్న ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో భారత్ అత్యంత క్రియాశీలక భూమిక పోషించబోతోంది. వాతావరణ మార్పులను నిరోధించే దిశగా ఇప్పటికే బలమైన హామీ ఇచ్చిన భారత్, ఆ దిశగా ఇతర దేశాలను సైతం సమాయత్తం చేయనుంది. ఈ లక్ష్యాలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యావరణ సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం బయలుదేరి వెళ్లారు.

Pages