జాతీయ వార్తలు

భారత్ పాత్రే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: వాతావరణ మార్పులపై పారిస్‌లో సోమవారం ప్రారంభం కానున్న ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో భారత్ అత్యంత క్రియాశీలక భూమిక పోషించబోతోంది. వాతావరణ మార్పులను నిరోధించే దిశగా ఇప్పటికే బలమైన హామీ ఇచ్చిన భారత్, ఆ దిశగా ఇతర దేశాలను సైతం సమాయత్తం చేయనుంది. ఈ లక్ష్యాలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యావరణ సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం బయలుదేరి వెళ్లారు. పారిస్ సదస్సులో తామంతా పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన కీలక సమస్యలపై చర్చించనున్నట్లు మోదీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ‘కోప్ 21’ సదస్సులో ప్రకృతి, పర్యావరణంతో భారత్ ఏ విధంగా మమేకం అయిందో, పర్యావరణ మార్పు సమస్యను ఎదుర్కోవడానికి ఏ విధంగా కట్టుబడి ఉందో అద్దం పట్టే ఇండియా పెవిలియన్‌ను సైతం తాను ప్రారంభించనున్నట్లు ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు. తాను, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే కలిసి ‘ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్’ సమావేశంలో పాల్గొననున్నట్లు కూడా మోదీ తెలిపారు.
రెండు రోజుల పర్యటన సందర్భంగా ‘లీడర్స్ ఈవెంట్’లో మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని తన ప్రసంగంలో భూతాపానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించడంతో పాటుగా కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించడానికి భారత దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తారని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏర్పాటు చేసిన ‘మిషన్ ఇన్నోవేషన్’ కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారు. సదస్సు నేపథ్యంలో మోదీ ఒబామా సహా పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. వాతావరణ మార్పులపై పోరాడాల్సిన బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ఉందని అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదిస్తున్న తరుణంలో ఈ బాధ్యత అందరిదీ అని ప్రధాని స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన దేశాలే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటున్నాయని, అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులను సమకూర్చడంతో పాటుగా తక్కువ వ్యయమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా భూతాపంపై పోరాటంలో ఆ దేశాలు మరింత ఎక్కువ పాత్ర పోషించాలని మన దేశం మొదటినుంచీ వాదిస్తున్న విషయం తెలిసిందే.
chitram...
ఆదివారం పారిస్‌కు పయనమైన మోదీ