S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/01/2015 - 05:59

ప్రజాస్వామ్య వ్యవస్థకు అదే అసలైన బలం * వెంకయ్య నాయుడు

12/01/2015 - 05:23

‘నిధుల స్తంభన’పై సుప్రీంకోర్టు నిర్ణయం

12/01/2015 - 05:22

ఏ పార్టీతో పొత్తులుండవు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై దిగ్విజయ్ సింగ్ స్పష్టీకరణ

11/30/2015 - 18:44

న్యూఢిల్లీ : టెలికాం మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి మారన్ వచ్చారు. మారన్‌ను ప్రశ్నించడానికి తమ కస్టడీలోకి ఇవ్వాలని సీబీఐ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం విదితమే.

11/30/2015 - 18:42

న్యూఢిల్లీ : వద్చే ఏడాదికల్లా దేశంలో నూతన విద్యావిధానాన్ని తీసుకువస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆమె లోకసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సీబీఎస్‌ఈ, రాష్ట్ర విద్యా బోర్డులతో కలిసి ఈ కొత్త విధానాన్ని తీసుకు వస్తామని, ఇప్పటికే ప్రాధమికంగా పని ప్రారంభమైందని వెల్లడించారు.

11/30/2015 - 17:01

న్యూఢిల్లీ : విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు డిసెంబర్‌ 8న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. విద్యుత్‌ బిల్లు-2014కి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు ఏఐపీఈఎఫ్‌ ఛైర్మన్‌ శైలేంద్ర దుబే తెలిపారు. ఈ మేరకు రేపు ఢిల్లీలో సమావేశమై సమ్మె వ్యూహంపై చర్చించనున్నామన్నారు.

11/30/2015 - 16:59

న్యూఢిల్లీ : అసహనానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కానన్లను ప్రయోగించారు. ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

11/30/2015 - 16:45

న్యూఢిల్లీ: తాను తన పుట్టిన రోజు డిసెంబర్ 13న రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఖండించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వివరించారు. రాజకీయ పదవీ విరమణపై తానేలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఇవాళ ఆయన తన ట్విట్లర్‌లో పేర్కొన్నారు.

11/30/2015 - 16:24

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన 18 మంది మహిళలు షిరిడీ సాయి బాబా దర్శనానికి వెళ్లారు.సాయిబాబా దర్శనం అనంతంర ఒక వాహనంలో నాసిక్ వెళ్తుండగా.. వీళ్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

11/30/2015 - 15:47

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వాన్ని దాచిపెట్టారంటూ మనోహర్‌లాల్ శర్మ అనే న్యాయవాది రాహుల్‌గాంధీపై పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ సరియైనది కాదంటూ తిరస్కరించింది.

Pages