S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/01/2015 - 18:40

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఏకాభిప్రాయం అవసరం లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. వస్తు-సేవల పన్ను బిల్లుకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని తెలిపారు.

12/01/2015 - 18:39

న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్‌ విషయంలో ఆప్‌కు పూర్తి మద్దతిస్తున్నట్లు సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిన్న దిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టింది. జన్‌లోక్‌పాల్‌ బిల్లు విషయంపై ఆప్‌ నేతలు కుమార్‌ విశ్వాస్‌, సంజయ్‌సింగ్‌లు ఈరోజు అన్నాహజారేని ఆయన స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో కలిసి మాట్లాడారు. వారిని కలిసిన అనంతరం హజారే విలేకరులతో మాట్లాడారు.

12/01/2015 - 17:07

గుజరాత్ : అసహనంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి స్పందించారు. ఆయన గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెత్త రోడ్లపై లేదని, మన మనస్సులో ఉందని, దానిని తొలగించుకోవాలని అన్నారు. ఇక్కడ అన్నిరకాల ప్రజలు సమానమేనని, అందరూ సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు.

12/01/2015 - 17:01

లక్నో : యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లా రతౌలి గ్రామంలో దారుణం జరిగింది. కన్న బిడ్డలను తన తల్లి ముందే దారుణంగా హత్య చేశారు. పెద్ద కూతురు రేఖ(25)కు పెళ్లి అయింది. తల్లి వద్దే ఉంటుంది. చిన్న కూతురు సవిత(19)కు ఇంకా వివాహం కాలేదు. సోమవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు ఇద్దరు కూతుళ్ల గొంతు నులిమి చంపేశారని తల్లి పోలీసుల ముందు వాపోయింది.

12/01/2015 - 16:53

న్యూఢిల్లీ : ఉత్తరాదిని పొగ మంచు కమ్మేసింది. సాయంత్రం 4.30 గంటలకే కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు

12/01/2015 - 13:46

చెన్నై : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి చెందిన సంస్థల్లో ఐటీ, ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఆయన నివాసాల్లో కూడా తనిఖీలు చేశారు.

12/01/2015 - 13:43

న్యూఢిల్లీ : భాజపా అగ్రనేత అద్వానీ భార్య కమల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది తలెత్తటంతో ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

12/01/2015 - 11:45

దిల్లీ: దేశ వ్యాప్తంగా అసహనం పెరుగుతోందని, ఇందుకు మత రాజకీయాలే కారణమని వామపక్ష పార్టీల ఎం.పీలు ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఉదయం వారు ఆందోళనకు దిగారు. అసహనంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించాలని వారు డిమాండ్ చేశారు.

12/01/2015 - 11:42

దిల్లీ: పారిస్‌లో రెండురోజుల పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.

12/01/2015 - 07:36

న్యూఢిల్లీ, నవంబర్ 30: మచిలీపట్నం, కాకినాడ, నక్కపల్లి ప్రాంతాల్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయటానికి ఉన్న అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను అందచేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయం చెప్పారు.

Pages