జాతీయ వార్తలు

రాజీనామాకు సిద్ధపడ్డ కలాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, నవంబర్ 30: ప్రజల రాష్టప్రతిగా ఘనమైన ప్రతిష్టను సంతరించుకున్న అబ్దుల్ కలాం ఒక దశలో ఈ సమున్నత రాష్టప్రతి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఆయన ప్రెస్ కార్యదర్శిగా పనిచేసిన ఎస్.ఎం.ఖాన్ వెల్లడించారు. బిహార్ అసెంబ్లీ రద్దును సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాష్టప్రతి పదవికి రాజీనామా చేయాలని కలాం నిర్ణయించుకున్నారని ఖాన్ తెలిపారు. అసలు బిహార్ అసెంబ్లీ రద్దుచేయడం కలాంకు ఎంతమాత్రం ఇష్టం లేదని, ప్రభుత్వ సిఫార్సును తిరస్కరించే అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ వరుసగా రెండోసారి కూడా ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదన రావడంతో అనివార్య పరిస్థితుల్లో దానిపై సంతకం చేయాల్సి వచ్చిందని ఖాన్ వెల్లడించారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు బిహార్ అసెంబ్లీ రద్దును తిరస్కరించిందో కలాం అంతర్గతంగా చాలా మధనపడ్డారని, కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. అయితే సుప్రీం నిర్ణయంతో తన పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి కలాం వచ్చేశారని, ఇందుకు సంబంధించి తన సోదరుడ్ని కూడా సంప్రదించారని ఖాన్ తెలిపారు. అయితే తన రాజీనామా వల్ల రాజ్యాంగపరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిపారు. 2005లో అప్పటి బిహార్ గవర్నర్ బూటాసింగ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయాలని కేంద్రంలోని యుపిఏ సారథ్యంలోని మన్మోహన్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆ సిఫార్సును మన్మోహన్ ప్రభుత్వం ఆమోదించి రాష్టప్రతికి పంపింది. అయితే మాస్కో పర్యటనలో ఉన్న కలాం అక్కడినుంచే దీనిపై సంతకం చేశారు. బిహార్ అసెంబ్లీ రద్దు వ్యవహారం రాజకీయ వివాదం రేకెత్తించడంతో వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2005 డిసెంబర్ 7న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తిరస్కరించింది. దీనివల్ల అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కలాం గురించి అనేక అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించిన ఎస్.ఎం.ఖాన్ ఆయనకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత అంశాలను వెల్లడించారు. కలాంకు సొంతంగా ఏదీ లేదని, ఓ ఇల్లుగానీ, కారుగానీ, టీవీగానీ, రిఫ్రిజిరేటర్‌కూడా ఉండేది కాదని తెలిపారు. తన మొత్తం జీవితాన్ని శాస్తవ్రేత్తగా, టీచర్‌గానే గడిపారని, హోటళ్లలోనూ, అతిథిగృహాల్లోనే ఉండేవారని వెల్లడించారు. అయితే, ఆయనకున్న సొంత ఆస్తి పుస్తకాలేనని, ఏ పుస్తకాన్నైనా సొంతంగా కొనుక్కోవాలి తప్ప ఎవరినుంచో దానిని తీసుకోకూడదన్న నియమాన్ని చివరివరకు కలాం పాటించారని ఖాన్ తెలిపారు. ఎందుకంటే బహుమతిగా వచ్చిన పుస్తకాలను పక్కనపెట్టేస్తాం తప్ప వాటిని చదవమన్న భావన ఆయనకుండేదని అన్నారు.