-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ : ఈ నేల మాది. మేము ఈ దేశం వాళ్లమే. దేశాన్ని విడిచి వెళ్లం అని లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులర్ అనే పదం అంబేద్కర్ ఎందుకు జోడించారో అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోకసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఐదు వేల ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని అన్నారు.
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దట్టంగా పొగమంచు అల్లుకుంది. దీంతో విమానాలు లాండ్ అయ్యే అవకాశాలు లేకపోవటంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. అలాగే పొగమంచు వల్ల కొన్ని ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
న్యూఢిల్లీ : రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్లమెంట్ సభ్యులు వ్యవహరిస్తారని అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరిస్తామని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశాలలో చెప్పారని వెల్లడించారు.
న్యూఢిల్లీ : సామాజిక సమానత్వానికి అంబేద్కర్ పెద్దపీట వేశారని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం ఈరోజు, రేపు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు.
న్యూఢిల్లీ : రాజ్యాంగ స్ఫూర్తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన లోకసభలో భారత రాజ్యాంగం-కట్టుబాట్లపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిష్పాక్షికంగా, నిజాయితీగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఆయనను దళిత నాయకుడిగా సంకుచిత దృష్టితో చూడటం తగదన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీగా పసునూరి దయాకర్ ప్రమాణస్వీకారం చేశారు. పసునూరి తెలుగు భాషలో ప్రమాణం చేశారు. ఇక ఇటీవల చనిపోయిన పార్లమెంట్ మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది.
బెంగళూరు, నవంబర్ 25: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అవసరమేనని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందని, అయితే పన్ను రేటు పరిమితిసహా కొన్ని అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
శ్రీనగర్, నవంబర్ 25: నియంత్రణ రేఖకు సమీపంలో జమ్మూకాశ్మీర్‌లోని తంఘ్‌దర్ సెక్టర్‌లోని ఒక సైనిక శిబిరంపై బుధవారం ఉగ్రవాదులు దాడికి దిగారు. తేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఏడు గంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఆ ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మృతి చెందినట్లు ఆర్మీ తెలిపింది. ఒక సైనికుడు గాయపడ్డాడు.
న్యూఢిల్లీ, నవంబర్ 25: ఒక కేసుకు సంబంధించి సిడిలు, పత్రాలను కూడా సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఆధారాలు నిజమైనవా కాదా అని నిరూపించుకునే అవకాశం కక్షిదారులకు ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ, నవంబర్ 25: రైల్వే స్టేషన్లలో తప్పిపోయినవారి పిల్లలను తల్లిదండ్రులు గుర్తించేందుకు వీలుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పిపోయినవారి పిల్లలను గుర్తించేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.