జాతీయ వార్తలు

ఆన్‌లైన్‌లో దొరికిన పిల్లల ఫొటోలు తల్లిదండ్రులు తేలికగా గుర్తించే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: రైల్వే స్టేషన్లలో తప్పిపోయినవారి పిల్లలను తల్లిదండ్రులు గుర్తించేందుకు వీలుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పిపోయినవారి పిల్లలను గుర్తించేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
రైల్వేస్టేషన్లలో దొరికిన చిన్నారుల ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల వారి తల్లిదండ్రులు తక్షణం గుర్తించేందుకు, తల్లిదండ్రుల వద్దకు చేరేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని ఒకటవ ప్లాట్‌ఫారంపై తప్పిపోయిన పిల్లలకు సహాయం అందించేందుకు ప్రత్యేకంగా బూత్‌ను నెలకొల్పారు. ఈ సందర్భంగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ శిశు రక్షణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను కాపాడేందుకు గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా, ఇళ్లనుంచి పారిపోకుండా ఉండేందుకు సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని, వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని ప్రభు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి మేనకాగాంధీ మాట్లాడుతూ కిడ్నాప్ చేసిన పిల్లలను గానీ, తప్పిపోయిన వారిని గానీ ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలకు రైళ్ల ద్వారానే తరలిస్తున్నారని పేర్కొన్నారు. వీరికి మద్యం, మత్తు పదార్థాలు, పొగాకు వాడకం తదితర చెడు అలవాట్లకు బానిసలుగా చేస్తున్నారని తెలిపారు. చిన్నారుల రక్షణపై రూపొందించిన పోస్టర్లను అన్ని రైల్వేస్టేషన్లు, బోగీల్లో ప్రదర్శిస్తామని, స్టేషన్లలో ఒంటరిగా తిరుగుతున్న పిల్లలను ఎవరైనా గుర్తిస్తే పోస్టర్‌పై ఉన్న చైల్డ్‌లైన్ నెం.1098కు తెలియజేయాలని మేనకా గాంధీ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం 20 స్టేషన్లలో పోస్టర్లను అందుబాటులో ఉంచుతామని, త్వరలోనే దేశవ్యాప్తంగా 12వేల స్టేషన్లకు విస్తరిస్తామని మేనకాగాంధీ పేర్కొన్నారు.