-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, నవంబర్ 25: పవిత్ర మత గ్రంథాల పేర్లను ట్రేడ్‌మార్క్‌గా వినియోగించుకునే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రామాయణం, ఖురాన్ వంటి మత గ్రంథాల పేర్లను ట్రేడ్‌మార్క్‌గా వాడుకోరాదని పేర్కొంది. ‘రామాయణ, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహెబ్ వంటి ఎన్నో పవిత్ర మత గ్రంథాలు ఉన్నాయి.
ముంబయి, నవంబర్ 25: దేశంలో పెరుగుతున్న అసహన ధోరణులపై సోమవారం ఢిల్లీలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బుధవారం ఇక్కడ స్పష్టం చేశారు. అయితే తనకు కాని, తన భార్య కిరణ్ రావుకు కాని భారతదేశాన్ని విడిచివెళ్లాలన్న ఆలోచన లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆత్మరక్షణలో పడిన సర్కారుపై ముప్పేట దాడికి సమైక్య ప్రతిపక్షం సిద్ధమవుతోంది. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాలం సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. బిహారు విధానసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం, పెరుగుతున్న ధరలు, అసహనంపై పెల్లుబుకుతున్న నిరసనలతో ఇరుకునపడిన మోదీ సర్కారుపై కత్తులు దూసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సాఫీగా జరిగి కీలకమైన బిల్లులు ఆమోదం పొందటానికి సహకరించవలసిందిగా ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తిచేసింది. గతంలోమాదిరి ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తగులుతాయని గ్రహించిన ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి తన వ్యూహం మార్చుకుంది.
ముంబై: దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ దేశం విడిచి వెళ్దామని తన భార్య ఆందోళనపడిందని వ్యాఖ్యానించిన అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. తన ఇంటర్వ్యూ పూర్తిగా చూడనివాళ్లే కావాలని తనమీద బురదజల్లేందుకు ప్రయత్నించారని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నాడు. భారతదేశం తన మాతృభూమి అని, తానీ దేశాన్ని ప్రేమిస్తున్నానని చెబుతూ, ఇక్కడ పుట్టినందుకు తనను తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు తెలిపాడు.
లక్నో: భారత్‌లో తీవ్ర అసహనం ఉందని, ఓ సందర్భంలో తన భార్య ఈ దేశం నుంచి వెళ్లిపోదామన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మద్దతు పలికారు. దేశంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ములాయం వ్యాఖ్యానించారు. అమీర్ వ్యాఖ్యలు కొంతమందిని బాధపెట్టి ఉండవచ్చునని, కేంద్ర ప్రభుత్వం అమీర్ ఖాన్‌తో మాట్లాడాలన్నారు.
బెంగళూరు : బీహార్‌లో నితీశ్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ నితీశ్ నిజాయితీపరుడని అన్నారు. లాలూ అవినీతికి ఆయన కుమారులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
న్యూఢిల్లీ: భారత్ లో అసహనం ఎక్కువైందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపట్ల కేంద్రమంత్రి వెంకయ్యానాయుడు స్పందించారు. ఆ వ్యాఖ్యలు తమను చాలా బాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన ఘర్షణలు తగ్గుతూ వచ్చాయి. అమాయక ప్రజలను మావోయిస్టుల చంపేసే ఘటనలు తగ్గిపోయాయి. వేధింపులు కూడా తగ్గుముఖం పట్టాయి' అని ఆయన చెప్పారు.
జమ్ము కాశ్మీర్: కుప్వారా జిల్లా టాంగ్దర్ సెక్టార్‌లో సైనిక శిబిరాలపై ఉగ్రవాఉదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భారత జవాన్లు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టారు. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు తెలిపాయి. దాదాపు ఏడు గంటల పాటు ఇరు వర్గాల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పాయి.
దిల్లీ: భాజపా సీనియర్ నాయకులతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఉదయం తన ఇంట్లో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం జరిగే ఎన్‌డిఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ఈ సందర్భంగా వెంకయ్య పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు.