జాతీయ వార్తలు

సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సాఫీగా జరిగి కీలకమైన బిల్లులు ఆమోదం పొందటానికి సహకరించవలసిందిగా ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తిచేసింది. గతంలోమాదిరి ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తగులుతాయని గ్రహించిన ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి తన వ్యూహం మార్చుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ కొంత సేపుహాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సాఫీగా జరగటానికి, అత్యంత కీలకమైన బిల్లులు సభల ఆమోదం పొందటానికి సహకరించవలసిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు లేవదీసే ప్రతి అంశంపై చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జిఎస్‌టి బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలు లేవదీసే అభ్యంతరాలను నివృత్తి చేస్తారని ఆయన చెప్పారు. అదే విధంగా వచ్చే వారం పారిస్‌లో వాతావరణంపై జరుగుతున్న సదస్సులో మన దేశం అనుసరించనున్న విధి విధానాలపై పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ ప్రతిపక్షాలకు వివరిస్తారని మోదీ తెలియచేశారు. దేశాభివృద్ధిలో జిఎస్‌టి బిల్లు కీలక పాత్ర వహిస్తుందని చెబుతూ, ఈ బిల్లును ఆమోదించవలసిందిగా ఆయన ప్రతిపక్షాలను కోరారు. జిఎస్‌టి బిల్లుకు ఆమోదం పొందటానికి ప్రభుత్వం రాజ్యసభలో కాంగ్రెస్‌పై ఆభారపడింది. కాంగ్రెస్ చేసిన సవరణలకు కేంద్రం తల ఊపింది. అయితే రాష్ట్రాలతో సంప్రదించి వారి సూచనలు తీసుకోకుండాప్రభుత్వం ఏకపక్షంగా జిఎస్‌టిని ఆమోదించాలని కోరటంపై సిపిఎం పక్ష నాయకుడు సీతారామ్ ఏచూరి అధ్యంతరం తెలియచేశారు. జిఎస్‌టి బిల్లు చట్టరూపం దాల్చటం ఆలస్యమైన కొద్దీ అభివృద్ధికి అంతరాయం ఏర్పడుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలకు వివరించారు. అయితే జెడి(యు) జిఎస్‌టి బిల్లుకు మద్దతు ప్రకటించడం ఓ కీలక పరిణామం. అఖిల పక్ష సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడిన ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ జిఎస్‌టి బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు సాఫీగా జరిగిపోతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ప్రతిపక్షాలతో ఏ అంశంపైనైనా చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ప్రజాసమస్యలపై చర్చించటానికి వీలుపడుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
chitram...
అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ