జాతీయ వార్తలు

దండకారణ్యంలో యుద్ధమేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, నవంబర్ 27: ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య నువ్వా నేనా? అన్న చందంగా పోరు సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో అరణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది. మావోయిస్టు నేతలే లక్ష్యంగా పోలీసులు అరణ్యాన్ని అణవణువూ జల్లెడపడుతున్నారు. మావోయిస్టు నేతలను పట్టుకోవడమో లేక మట్టుపెట్టడమో చేయాలని వ్యూహాత్మకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు నేతలైన రామన్న, ఇడుమ, సోను, నగేష్, అయితులే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నట్టు తెలిసింది. దీంతో నిన్నమొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న దండకారణ్యం కాల్పులు, విధ్వంసాలతో మళ్లీ వేడెక్కుతోంది. మావోయిస్టు నేతలను టార్గెట్‌గా చేసుకుని పోలీసుల జరిపిన వివిధ ఆపరేషన్లలో పలువురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు నేత రైనును పోలీసులు మట్టుపెట్టగలిగారు. మరో నేత అయితును బుల్లెట్‌తో గాయపర్చారు. పలువుర్ని అరెస్టుచేశారు.
పోలీసు దాడులకు ప్రతీకారంగా మావోయిస్టులు దండకారణ్యంలో ఇటీవలికాలంలో విధ్వంసాలు కొనసాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంకేల్, సుకుమా జిల్లాల్లో రెండు బస్సులను దగ్ధం చేశారు. సుకుమా, దంతేవాడ జిల్లాల్లో చెట్లను నరికి రోడ్లపై అడ్డంగా పడేశారు. అలాగే వాల్‌పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు వదిలి వెళ్లారు. బీజాపూర్ జిల్లాలో మందుపాతర పేల్చి ఇద్దరు జవాన్లను తీవ్రంగా గాయపర్చారు. ఇరువర్గాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో అరణ్యం దద్దరిల్లుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న అడవి బిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ క్షణాన ఎటువైపు నుండి ప్రాణహాని కలుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.

కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలు (ఫైల్ ఫొటో)