జాతీయ వార్తలు

ఆంధ్రకు హోదాపై చర్చిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఆంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించే విషయంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఐదేళ్లుకాక పదేళ్లపాటు ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తామని ప్రకటించామని ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ అన్నారు. అయితే రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వటానికి వీల్లేదని 14వ ఫైనాన్స్ కమిషన్ స్పష్టం చేయటంతో పరిస్థితి తారుమారవుతోందని అంగీకరించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సైతం ప్రత్యేక కేటగిరికి పట్టుబడుతున్నాయని అంటూ, అత్యంత అభివృద్ధి చెందిన పంజాబ్ సైతం హోదా డిమాండ్ చేస్తోందన్నారు. ఆంధ్రకు ప్రత్యేక కేటగిరి హోదా ఇచ్చే విషయంపై నీతి ఆయోగ్ అభిప్రాయం కోసం నిరీక్షిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు.