జాతీయ వార్తలు

హోదా ఇవ్వకపోతే.. మోదీ నివాసం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ 7 తుది గడువు
సిపిఐ నేత రామకృష్ణ హెచ్చరిక

న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాప్రకటించే విషయమై కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడో తేదీలోగా తుది నిర్ణయం ప్రకటించని పక్షంలో ప్రధాని నివాససాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటున్నారో లేదో ప్రభుత్వం ఈ వ్యవధి లోపు స్పష్టం చేయాలని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు పది సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేసి తమ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమైనందున పదేళ్లపాటు ఈ హోదా కల్పిస్తామని రాజ్యసభలో ప్రకటించిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. తన వల్లే ప్రత్యేక హోదా లభించిందని ప్రచారం చేసుకుని సన్మానాలు చేయించుకున్న వెంకయ్యనాయుడు ఇప్పుడు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని ఈ విషయంపై నిలదీయటానికి జంకుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నాయుళ్లిద్దరూ ప్రజలను మాయమాటలతో మభ్య పెడుతున్నారన్నారు. పునర్విభజన చట్టంలో చేసిన హామీల అమలులో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ విమర్శించారు.
‘లోటు బడ్జెట్ భర్తీకి కావలసిన నిధులను అంద చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. సుమారు 23వేల 400కోట్ల రూపాయలను ఈ ఖాతాకింద ఇవ్వవలసిందిగా రాష్ట్రప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం మూడు వందలకోట్లను విడుదల చేసి చేతులు దులుపుకుంద’ని ఆయన మండిపడ్డారు. సెయిల్ సారథ్యంలో రాయలసీమలోఉక్కుకర్మాగారం నిర్మిస్తామని ఇచ్చిన హామీ అతీగతీ లేకుండా పడి ఉందని రామకృష్ణ చెప్పారు.
(చిత్రం) ఢిల్లీలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ నేత రామకృష్ణ