జాతీయ వార్తలు
సమాజంలో చీలికలకు కుట్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: స్వాతంత్ర పోరాటంలోనే కాక ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాజ్యాంగం రూపొందించడంలో కీలక పాత్ర వహించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్, వౌలానా ఆజాద్ వంటి ప్రముఖలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ప్రజల హృదయాల నుంచి మహానేతల గుర్తులను చెరిపివేయడం ప్రభుత్వం వల్లకాదని ఆయన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతోత్సవాలను జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. విభజించి పాలించు అన్న బ్రిటీష్ సిద్ధాంతాన్ని మోదీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం అమలు చేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. వివిధ రూపాల్లో సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. రాజ్యాంగం ఎలా ఉండాలి? వివిధ వర్గా ల అభ్యున్నతి, సంక్షే మం కోసం తీసుకోవల్సిన చర్యలను సూచిస్తూ రా జ్యాంగంలో ఒక తీర్మానంతోప్రవేశికను తయారు చేసిన పండిట్ నెహ్రూ పేరును ప్రస్తావించకుండా రాజ్యాంగంపై మాట్లాడటం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు. ‘బిజెపిలో ఇప్పుడు చెప్పుకోతగిన నాయకుడు లేడు. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న చరిత్రలేదు. రా జ్యాంగం రూపకల్పనలో వీరి పాత్ర శూన్యం’అని ఆజాద్ ఎద్దేవా చేశారు. కేం ద్ర ప్రభుత్వ తీరు చూ స్తుంటే చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తోందాఅన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళులర్పించాలన్న ఆలోచన కేంద్రానికి ఇప్పుడు ఎందుకు వచ్చిందో అంతుపట్టటం లేదని ఆజాద్ అన్నారు. ‘రాజ్యాంగం అమలులోకి వచ్చి జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని అంబేద్కర్ నిర్ణయించారు. ఆగస్టు 15న మనం స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక నుంచి జనవరి 26న కాక నవంబర్ 26న గంతంత్ర దినోత్సవాన్నినిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా? అన్న అనుమానం కలుగుతోంది’అని ఆయన తెలిపారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని ఆజాద్ విమర్శించారు. పెరిగిపోతున్న అసహనానికి నిరసనగా దేశంలోని మేధావులు చేపట్టిన నిరసనల నుంచి ప్రభుత్వం గుపాఠం నేర్చుకోవాలని ఆయన హితవుచెప్పారు. అంబేద్కర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రభుత్వం దళితులపై జరుగుతున్న అత్యాచారాను అదుపుచేయటంలో విఫలమవుతోందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. తీవ్రవాదానికి పాల్పడేవారు ఏ మతం వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.