S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/26/2016 - 21:03

వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా తమిళంలో రూపొందిన ‘డమాల్ డుమీల్’ చిత్రాన్ని ధనాధన్ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని. బ్లాక్‌బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

02/26/2016 - 21:02

సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు.’ యూనీ క్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జి.సి.జగన్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ మంత్రి వేణుగోపాలాచారి క్లాప్ నివ్వగా, వేమూరి రాధాకృష్ణ స్విచ్ ఆన్ చేశారు. చలసాని శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.

02/26/2016 - 21:01

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, గ్లామర్ భామగా పలు అవకాశాలతో దూసుకుపోతోంది శృతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలనే కోరిక ఇంకా తీరనట్టుంది. నిజానికి బాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన శృతికి అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది.

02/26/2016 - 21:00

-రాశీఖన్నా

02/26/2016 - 20:59

‘అందాల రాక్షసి’తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిలైన లావణ్యా త్రిపాఠీకి ఈమధ్య వరుసగా రెండు విజయాలు దక్కాయి. నానితో భలేభలే మగాడివోయ్, నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో సూపర్‌హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ భామకు ఇప్పుడు అవకాశాల జోరు పెరిగింది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తున్న లావణ్యకు మరో క్రేజీ అవకాశం దక్కింది. వరుణ్‌తేజ్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కోట్టేసింది.

02/26/2016 - 20:59

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. దీనికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో మార్చి 1న విడుదల చేస్తారు.

02/26/2016 - 20:58

కన్నడంలో నుంచి వచ్చిన సంజన ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత చేసిన చిత్రాలన్నీ ఆమెకు ఏమాత్రం కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఇక తన పని అయిపోయిందని అనుకున్న సమయంలో పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్‌లో సంజనకు అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో అచ్చమైన తెలుగమ్మాయిగా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలు కట్టుకుని మరీ కనబడుతుందట.

02/26/2016 - 20:57

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వుంది. సహచర తారలందర్నీ వెనక్కి నెట్టి ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకుంది. ఆమె చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే కావడం మరో విశేషం. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాక హాలీవుడ్‌లో తన పతాకాన్ని ఎగురవేస్తోంది. ఆమె త్రిబుల్‌ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలో విన్ డీజిల్‌తో కథానాయికగా నటిస్తోంది.

02/26/2016 - 01:34

సాయిరామ్‌శంకర్, నిఖిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో సురేష్‌వర్మ, బాబులు నిర్మిస్తున్న అరకురోడ్‌లో చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం షూటింగ్ లొకేషన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో సాయిరామ్‌శంకర్ మాట్లాడుతూ, ‘రెండురోజులుగా పబ్‌లో షూటింగ్ జరుపుతున్నాం. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

02/26/2016 - 01:31

కన్నడంలో విజయవంతమైన ముంజానీ చిత్రాన్ని తెలుగులో జర్నీ-2గా విడుదల చేస్తున్నారు. గణేష్, మంజరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై చిగులూరి గంగాధర్‌రావు చౌదరి అందిస్తున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరని అన్నారు.

Pages