S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/19/2016 - 21:34

నారా రోహిత్, రెజీనా జంటగా తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో శ్రీ లీలా మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘శంకర’. తమిళంలో విజయవంతమైన ‘వౌనగురు’ చిత్రానికి రీమేక్‌గా నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చేనెల 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

08/19/2016 - 21:33

శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై సంజయ్, చేతన ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన తారాగణంగా వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హీరో నాని విడుదల చేశారు.

08/19/2016 - 21:31

తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రెజీనా ప్రస్తుతం నక్షత్రం సినిమాలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతోబాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘జోఅచ్యుతానంద’ సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా ఈమె బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ నటుడు అమితాబ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన నటించేందుకు ఓకె చెప్పిందట.

08/19/2016 - 20:57

తమిళంలో ‘పిచ్చాయైకారన్’ పేరుతో రూపొందిన సినిమా తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై భారీ వసూళ్లు దక్కించుకుని సంచలనం క్రియేట్ చేసింది. కేవలం యాభై లక్షలు పెట్టి తెలుగు హక్కులు తీసుకున్న ఈ సినిమా ఏకంగా 21 కోట్ల రూపాయలు వసూలు చేసి దుమ్ము రేపింది. ఇప్పటికీ ఇంకా ఆడుతున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

08/18/2016 - 21:07

ఆది, నమితా ప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆది, నటుడు సాయికుమార్‌లు చెప్పిన విశేషాలు..
మా ఇద్దరి కాంబినేషన్

,
08/18/2016 - 21:04

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దంపట్టే రాఖీ పండుగ వేడుకలను దేశమంతా ఆనందంగా జరుపుకున్నారు. సామాన్య ప్రజలతోపాటు సినిమా తారలు కూడా తమ సోదరులకు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను పంచుకున్నారు. తాజాగా హీరో వరుణ్ తేజ్ రాఖీకట్టింది నిహారిక. అలాగే హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, లావణ్య త్రిపాఠి, పరిణితి చోప్రా, ఏక్తాకపూర్‌లు తమ సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు.

08/18/2016 - 21:01

ప్రముఖ నటుడు చిరంజీవి చాలా గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని నానాక్‌రామ్‌గూడాలో వేసిన ప్రత్యేక సెట్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందిస్తున్న ఈ ఫైట్స్ హైఓల్టేజ్ యాక్షన్స్‌తో వుంటాయని తెలిసింది.

08/18/2016 - 20:59

‘బాబు బంగారం’ సినిమాకు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులే బంగారం లాంటివారని హీరో వెంకటేష్ అన్నారు. వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.నాగవంశి, పి.డి.వి ప్రసాద్ నిర్మించిన ‘బాబు బంగారం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు.

08/18/2016 - 20:57

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ్ సూపర్‌హిట్ చిత్రం ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. వచ్చే నెలతో అన్ని కార్యక్రమాలు పూర్తికానున్నాయి. ఇక ఈ సినిమా తరువాత చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు.

08/18/2016 - 20:55

ప్రముఖ తమిళ నటుడు కార్తి తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగులో ‘ఊపిరి’ చిత్రంలో నటించిన కార్తి, ప్రస్తుతం కాష్మోరా అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలైంది. దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో కార్తి లుక్ కొత్తగా వుంది.

Pages