కొత్త సినిమాకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరో చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలుగులో ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన కథ, పాత్ర దొరకట్లేదని ఇటీవల బాహాటంగా ప్రకటించిన సమంత, తమిళంలో ఓ చిత్రాన్ని ఓకే చేసింది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో ఆమె నటించనుంది. ఈ చిత్రంలో దర్శకుడు హీరోయిన్ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడని చెబుతున్నారు. అందుకే ఆ పాత్రలో తాను నటిస్తానంటూ ఒప్పుకుంది సమంత. ఈ విషయాన్ని డైరెక్టుగా తన ట్విట్టర్‌లోనే ప్రకటించింది. ఇక పెళ్లిచేసుకోబోతున్న నేపథ్యంలో గ్లామర్ పాత్రలకు దూరంగా వుంటూ ఆర్ట్ సినిమాలవైపు చూస్తోంది సమంత. కనుక మంచి కథలు వుంటే సమంతను కలిస్తే చాలు.