మార్షల్ ఆర్ట్స్‌లో తాప్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే పింక్ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సొట్టబుగ్గల తాప్సీ. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించినా ఈమెకు సరైన విజయం దక్కలేదు. ముఖ్యంగా గ్లామర్‌కు సై అంటూ అవకాశాలు అందుకున్నా కూడా విజయం దక్కకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. తాజాగా పింక్ సినిమా విజయంతో ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. గత ఏడాది బేబీ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన తాప్సీ, దానికి సీక్వెల్‌గా రూపొందే ‘నామ్ షబానా’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం తాప్సీ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటోందట. దర్శకుడు నీరజ్‌పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని శివం నాయర్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. మొత్తానికి ఈ సినిమాతో తాప్సీ బాలీవుడ్‌లో సెటిల్ అయిపోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది.