శాతకర్ణి రాయల్ లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే దర్శకుడు క్రిష్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం మరో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఫస్ట్‌లుక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ రాయల్ లుక్‌తో వున్న పోస్టర్ మీడియా వర్గాల్లో సంచలనం క్రియేట్ చేసింది. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 11న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. శ్రీయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హేమమాలిని కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.