అంజలి...తారామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగమ్మాయి అంజలి, వసంత్ రవి, ఆండ్రియా ప్రధాన తారాగణంగా తమిళంలో రూపొందిస్తున్న చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకత్వంలో ఎల్.గోపీనాధ్, జె.సతీష్‌కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ, తమిళంలో తంగమీన్‌గళ్ చిత్రం ద్వారా మూడు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తారామణి చిత్రం వైవిధ్యమైన కథనంతో వుంటుందని, అంజలి నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో ఆండ్రియా గ్లామర్ రోల్‌లో కనిపిస్తోందని తెలిపారు. తెలుగులో హక్కులను స్వంతం చేసుకున్న తమ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి అందిస్తున్నామని, ఈ చిత్రంలోని పాటలకు మంచి ఆదరణ కూడా లభిస్తోందని, త్వరలో తెలుగులో కూడా విడుదల చేయనున్నామని అన్నారు.