S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/11/2016 - 23:57

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న తమన్నా, తాజాగా విశాల్ హీరోగా నటించే ‘కత్తి సందై’ అనే సినిమాకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. విశాల్ స్టైల్లో సాగిపోయే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్లగా, నేటినుంచి తమన్నా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు.

05/11/2016 - 23:52

తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న వేణుమాధవ్, కొద్దికాలంగా సినిమాల్లో కనిపించడంలేదు. ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో అనేక వదంతులు వస్తున్నాయి. వేణుమాధవ్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, ఆయన పరిస్థితి విషమంగా తయారైందని వార్తలు ప్రచురించాయి.

05/11/2016 - 22:20

ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మి’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విమర్శనాత్మకంగా పుస్తక రూపంలో మంగళగౌరి రాశారు. ఈ పుస్తకాన్ని నటుడు తనికెళ్ల భరణి బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ, పిహెచ్‌డి అవార్డు చేసే స్థాయిలో మంగళగౌరి ఈ పుస్తకాన్ని రచించారని, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలో డైలాగ్స్ విని..

05/10/2016 - 21:13

ఆది కథానాయకుడిగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమాకు సంబంధించిన ముగింపు సన్నివేశాల చిత్రీకరణ శంషాబాద్ దేవాలయంలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, బ్యాంకాక్‌లో తీసిన హీరో పరిచయం పాట, రాజమండ్రిలో చిత్రీకరించిన పాటలు బాగా వచ్చాయని తెలిపారు.

05/10/2016 - 21:11

కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులో నిర్మాత బావాజీ అనువదిస్తున్నారు. ‘ఐ లవ్ యూ’ పేరుతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎర్రచీర - నల్లచీర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

05/10/2016 - 21:10

ప్రశాంత్, ప్రియాంక జంటగా అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ పతాకంపై శివ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 4x4. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌నివ్వగా, సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

05/10/2016 - 21:09

తెలుగులో వరుస సినిమాలతో జోరుమీదుంది సమంత. మరోవైపు తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సమంత నటించిన ‘24’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. సూర్య త్రిపాత్రాభినయంలో విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కి అందరిచేత అభినందనలు అందుకుంటోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంత పాత్రికేయులతో ముచ్చటించింది.
---

05/10/2016 - 21:00

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో సాయి ధరమ్ తేజ్ సీడీని విడుదల చేశారు.

05/10/2016 - 20:59

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా హీరోలకు ధీటుగా సత్తాను చాటుకుంటూ మరోవైపు గ్లామర్ హీరోయిన్‌గా తన హవాను కొనసాగిస్తోంది అందాల భామ అనుష్క. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రంలో నటిస్తున్న ఈమె, మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘పిల్లజమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘్భగమతి’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.

05/10/2016 - 20:57

ప్రతి మనిషి జీవితంలో లక్ష్యాలుండడం సహజమే. కొందరు అవి సాధించేందుకు శ్రమిస్తే, మరికొందరు ఆ కోరికలు చంపుకుని బ్రతుకుతుంటారు. జీవితమంటే మనకు నచ్చినట్లు జీవించడం, మన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలనే కథతో తెరకెక్కించిన చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు, అలేఖ్య పుంజాల, వాసుదేవరావు, రేవంత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ లఘు చిత్ర ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది.

Pages