ఐటెం సాంగ్స్‌కు తగను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హీరోయిన్ ఎలా ఉంటే ప్రేక్షకులు ఇష్టపడతారో అలా హైపర్ చిత్రంలో నేను నటించాను. అందులో రెండు పాత్రల్లో వైవిధ్యమైన షేడ్స్ చూపడం మరింత ఆనందాన్నిస్తోంది. ఒకటి కళ్లజోడుతో అమాయకంగా కనిపించే భానుమతిలా, మరొకటి పక్కా మాస్ మసాలాతో మోడరన్‌గా ఉండే అమ్మాయిలా రెండు షేడ్స్‌ను దర్శకుడు ఎలా జెబితే అలా చేసుకుంటూ వెళ్లాను’ అని నటి రాశీఖన్నా తెలిపారు. రామ్, రాశిఖన్నా జంటగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్‌సుంకర రూపొందించిన ‘హైపర్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన అభినయానికి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో రాశిఖన్నా పలు చిత్ర విశేషాలను తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..
సిటీ చాలా ఇష్టం
నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇక్కడ షూటింగ్ ఉంది అంటే రావడానికి చాలా ఆనందంగా వుండేది. హైదరాబాద్ సిటీ అంటే నాకు చాలా ఇష్టం.
పాత్రలు మర్చిపోలేనివి
నేను ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ నాకు నచ్చినవే. ప్రభావతి, బెల్లం శ్రీదేవి లాంటివి బాగా గుర్తుంటాయి. ఇప్పుడు ఈ చిత్రంలో చేసిన భానుమతి పాత్రలో ఉన్న రెండు షేడ్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
కామెడీ టచ్
ఈ చిత్రంలో నేను కామెడీ ఉన్న పాత్రలో నటించాను. ఓ రకంగా నాకిష్టమైన జోనర్ ఇది. మొదట కష్టమనిపించినా దర్శకుడు ఎలా జెబితే అలా చేసుకుంటూ వెళ్లాను. నాలో కామెడీ టచ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే సెట్లో ఉన్నప్పుడు అందర్నీ నవ్విస్తుంటాను.
అరోగ్య సమస్యలున్నాయా?
ఈమధ్య తాత్కాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. ఈ చిత్రంలో చాలా వెయిట్ కూడా తగ్గినట్లు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అంతా ఓకే.
స్టయిల్ కేర్
హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినప్పటినుండి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకోక తప్పదు. ముఖ్యంగా స్టయిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎంటర్ కావాలని నేను ప్రయత్నించడం లేదు. ఇక్కడ వరకే స్టయిలిష్‌గా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. బాలీవుడ్‌లో చేయకడదనేం లేదు. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.
టెన్షన్ పడను
నటిగా నేనేదో సాధించాలని, ఏదేదో చేసేయాలని ఎప్పుడూ తొందరపడను. ఏదైనా స్లో అండ్ స్టడీగా నిదానంగా నా పని నేను చేసుకుపోవడమే నాకు తెలుసు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడానికి నేను సిద్ధమే. అలాగే పిరియాడిక్ సినిమాల్లో కూడా నటిస్తాను అవకాశం వస్తే.
డబ్బింగ్ ఇప్పుడే చెప్పను
నా డబ్బింగ్ నేను చెప్పుకోవాలనే వుంది. ఇప్పటికే రెండుమూడుసార్లు ప్రయత్నం చేశా. కానీ కుదర్లేదు. ఇంకొకటి అంత సమయం ఉండడం లేదు. అలాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా దాన్ని వినియోగించుకుని, నా డబ్బింగ్ నేను చెప్పుకుంటాను.
ఐటమ్స్‌కు సరిపోను
ఇప్పుడున్న హీరోయిన్లు ఐటమ్ పాటల్లో డాన్సు చేయడానికి ఒప్పుకుంటున్నారు. నా విషయానికి వస్తే ఐటమ్ పాటలకు నేను అంత కరెక్ట్ కాదు. అలాగని చేయనని చెప్పడం లేదు. మంచి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను.
హాబీలు
తీరిక సమయాల్లో క్రికెట్ ఆడడానికి ఇష్టపడతాను. మంచి పుస్తకాలు నా స్నేహితులు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గోడానికి ఇష్టపడతాను. అయితే ఎలాంటి సేవలు చేయాలి అనేది మాత్రం ఇప్పుడు చెప్పదలుచుకోలేదు.
చేతిలో ఉన్న ప్రాజెక్టులు
ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. రవితేజతో ఓ చిత్రం చర్చల్లో ఉంది. త్వరలో చెబుతాను. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలను త్వరలో చెబుతాను అంటూ ముగించారు.

- యు