కష్టాలను ఎదిరించేశంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారారోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ పతాకంపై తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో ఆర్.వి.చంద్రవౌళీప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘శంకర’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘వౌనగురు’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందించామని, కాలేజీలో చదివే ఓ కుర్రాడి ప్రశాంతంలోకి సాగుతున్న జీవితంలో అనుకోని అవాంతరాలు వస్తే వాటిని ఎలా అధిగమించాడు అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. సమాజంలో వున్న లోటుపాట్లు నచ్చని కుర్రాడు వాటిని ఎలా పెకలించాడు, అతనికి అందిన చేయూత ఎలాంటిది అనే ఆసక్తికరమైన కథనంతో చిత్రం సాగుతుందని తెలిపారు. అన్ని వర్గాలవారికి ఈ సినిమా నచ్చుతుందన్న నమ్మకం వుందని, 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని సమర్పకుడు ఎం.వి.రావు తెలిపారు. జాన్‌విజయ్, రాజీవ్ కనకాల తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:టి.సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత:చంద్రవౌళీప్రసాద్, దర్శకత్వం:తాతినేని సత్యప్రకాష్.