ప్రభుత్వ ఉద్యోగుల కోసం షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ కథానాయకుడుగా నటించిన హైపర్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండాలి అన్న కథనం చర్చించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకోసం ప్రత్యేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని చాటిచెప్పే విధంగా రూపొందిన ఈ చిత్రంలోని సందేశం ప్రతి ఒక్కరికీ చేరుతోందని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శంగా నిలిచి పాత్రలో సత్యరాజ్‌కు మంచి గుర్తింపు లభిస్తోందని, ఈ సినిమాకు మాటలు రాసిన అబ్బూరి రవికి మంచి ప్రశంసలు లభిస్తున్నాయని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిదని, అన్ని కేంద్రాలలో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని విజయపధంలో దూసుకెళుతోందని వారు తెలిపారు. సినిమాలో సత్యరాజ్ చేసిన పాత్ర ప్రతి ఉద్యోగికి కనెక్ట్ అవుతుందని, తప్పకుండా వారికి ఈ సినిమా నచ్చుతుందని, నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా సత్యరాజ్ నటన, రామ్ ఎనర్జిటిక్ యాక్షన్, సంతోష్‌శ్రీనివాస్ దర్శకత్వం, జీబ్రాన్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తున్నాయని వారు తెలిపారు.