హీరోగా సప్తగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తగిరి, రోషిణీప్రకాష్ జంటగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై అరుణ్‌పవార్ దర్శకత్వంలో కె.రవికిరణ్ రూపొందిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి సంబంధించిన బ్యానర్ లోగోను, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ హాస్యనటుడిగా ఉన్న తాను ఈ సినిమాతో హీరోగా మారానని, నన్ను నమ్మిన నిర్మాతలకు, దర్శకుడికి కృతజ్ఞతలని తెలిపారు. ఈ సినిమా వంద శాతం బెస్ట్ చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం వుందన్నారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చే సప్తగిరి ఏ సీన్‌లో ఎలా చేస్తే ప్రేక్షకులు ఇష్టపడతారో తెలిసిన నాకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆనందదాయకమని, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నామని దర్శకుడు అరుణ్ పవార్ అన్నారు. ఓ తమిళ సినిమాకు తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేర్పులు చేసి, తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, పోలీస్ వ్యవస్థలో కొన్ని విషయాలను నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని కుటుంబమంతా కలిసి చూడదగిన విధంగా అశ్లీలత లేకుండా ఈ సినిమా ఉంటుందని నిర్మాత కె.రవికిరణ్ తెలిపారు. కార్యక్రమంలో మేర్లపాక గాంధీ, మారుతి, సి.రామ్‌ప్రసాద్, అజయ్‌ఘోష్ పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. అలీ, పోసాని కృష్ణమురళి, షాయాజీషిండే, తులసి, షకలక శంకర్ నటిస్తున్న ఈ చిత్రానికి రచన: గోపినీ కరుణాకర్, పాటలు: రామ్ పైడిశెట్టి, సురేష్ బానిశెట్టి, మాటలు: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల, సంగీతం: బుల్‌గానిన్, కెమెరా: శ్రీరామ్‌ప్రసాద్, దర్శకత్వం: అరుణ్‌పవార్.