బాల నేరస్థుల మాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఫ్ అండ్ టఫ్‌గా తిరిగే కుర్రాళ్ళ కథనంతో నలుగురు బాల నేరస్థుల కథతో రూపొందించిన ‘మాంజా’ చిత్రం అందరికీ నచ్చిందని కథానాయకుడు దీప్ పాథక్ తెలిపారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అందించిన ‘మాంజా’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో మంచి రెస్పాన్స్‌తో సాగుతోందని ఆయన తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- కన్నడంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా వుందని, సస్పెన్స్ థ్రిల్లర్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో బాల నేరస్థులకు శిక్షపడటం, అందులో భాగంగా ప్రభుత్వం వారికి విద్యను అందించడం, వారి ప్రవర్తనలో మార్పులు తేవడం లాంటి అంశాలు చిత్రంలో వుంటాయని ఆయన తెలిపారు. ఇక ఈ చిత్ర దర్శకుడు ఓ జీనియస్ అని, క్రికెట్ ఆడుకునే వయసులోనే మెగా ఫోన్ పట్టుకుని ఈ చిత్రాన్ని రూపొందించాడని, ఇక నుండి తాను తెలుగు చిత్రాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు.