S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/20/2016 - 22:23

రవితేజ కథానాయకుడిగా నటించనున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమాను మార్చి 4వ తేదీన లాంచ్ చేయనున్నారు. నిజానికి ‘ఎవడో ఒకడు’ తరువాత రవితేజ చేయవలసిన సినిమా ఇది. అయితే ఆ సినిమాను రవితేజ వదులుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కుతోంది.

02/20/2016 - 22:22

నృత్య దర్శకుడు ప్రభుదేవా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించే తాజా చిత్రానికి ‘పాతాళభైరవి’ అనే పేరును పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన హీరోగా నటించనున్న ఈ హారర్ ఎంటర్‌టైనర్ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించనుంది. బాలీవుడ్‌లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభుదేవా చాలాకాలం తర్వాత దక్షిణాదిలో చేస్తున్న చిత్రమిది. అయితే ఇదే పేరుతో మరో నిర్మాత కూడా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

02/20/2016 - 22:22

‘నేను..శైలజ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన కీర్తిసురేశ్ మంచి ఛాన్స్ కొట్టేసింది. ప్రఖ్యాత దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న చిత్రంలో మహేష్‌బాబు సరసన కథానాయికగా ఆమెకు అవకాశం దక్కిందని తెలుస్తోంది. తెలుగు, తమిళభాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక కావొచ్చంటూ కొంతమంది కథానాయికల పేర్లు వినిపించాయి. తాజాగా సమాచారం ప్రకారం, ఆ ఛాన్స్ కీర్తిసురేష్‌కి లభించే అవకాశం వుంది.

02/20/2016 - 22:21

ఇంద్రనీల్ గుప్తా, జారాషా, అభిషేక్, కర్తవ్య ముఖ్యపాత్రల్లో రాజ్ మాదిరాజు దర్శకత్వంలో ఫరమ్9 పతాకంపై విజయరామరాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఐతే 2.0’. ఈ చిత్రానికి సంబంధించిన పాట రికార్డింగ్ శుక్రవారం మోక్ష స్టూడియోలో రికార్డ్ చేశారు.

02/19/2016 - 22:23

శ్రీశ్రీ ఆడియో ఫంక్షన్‌లో హీరో కృష్ణ

02/19/2016 - 22:22

నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

02/19/2016 - 22:21

మలయాళంనుండి రీమేక్ చేస్తున్న ‘ప్రేమమ్’ చిత్రానికి తెలుగులో కూడా అదే పేరును నిర్ణయించారు. నాగచైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన తారాగణంగా చందు మొండేటి దర్శకత్వంలో సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తయింది. వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

02/19/2016 - 22:21

కట్టూబొట్టుతో ఆకట్టుకోవడంలో బాలీవుడ్ తారలకు పోటీయే లేదు. ఆధునిక లేదా సంప్రదాయబద్ధమైన దుస్తులేవైనా
సరే తనకంటూ ఓ ఇమేజ్‌తో ఆహూతులను అలరించడం వారికి కొత్తేమీకాదు. ముంబైలో ఇటీవల జరిగిన
మేకిన్ ఇండియా సాంస్కృతిక వారోత్సవాల్లో బాలీవుడ్ తార సోనాలిబింద్రే సంప్రదాయబద్ధమైన చీరతో అందరి
మనసూ దోచుకుంటే డీప్‌నెక్‌జంప్ సూట్‌తో అమీజాక్సన్ అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ముంబైలో జరిగిన

02/19/2016 - 22:20

అలనాటి అందాలతార మాధురీదీక్షిత్ ఒకప్పుడు అభిమానులను తన అందచందాలతో అలరించేది. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైనా తరచూ ఏదోఒక కార్యక్రమంలో తళుక్కున మెరుస్తోంది. తాజాగా ఓ ఫోటోషూట్‌లో పాల్గొన్న మాధురి మునుపటిలా అందంగా కన్పించేందుకు ప్రయత్నించి సఫలమైంది.

02/19/2016 - 22:19

‘అల్లరి’ చిత్రంతో కెరీర్ ప్రారంభించి, హీరోగా 50 చిత్రాలు పూర్తిచేసుకున్నాడు అల్లరి నరేష్. ఈమధ్య వరుసగా సినిమాల్లో నటిస్తున్నా కూడా ఇతగాడికి అన్నీ అపజయాలే ఎదురవుతున్నాయి. తాజాగా మోహన్‌బాబుతో కలిసి నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నరేష్. తాజాగా ఓ క్రేజీ సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Pages