S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/12/2016 - 20:49

‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో హిట్ అందుకున్న మంచు విష్ణు హీరోగా మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. గీతాంజలితో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లక్కున్నోడు’ అనే టైటిల్‌ను ఓకె చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ వివరాలు తెలియజేస్తూ, ‘మంచు విష్ణు మా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా వుంది.

08/11/2016 - 21:08

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తన రెండో సినిమాతోనే సత్తా నిరూపించుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తిక్క’. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై రోహన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలకు సిద్ధమైంది. లారిస్సా బొనేసి, మన్నారా చోప్రాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘తిక్క’ విడుదలవుతున్న సందర్భంగా సాయిధరమ్ చెప్పిన విశేషాలు...

08/11/2016 - 21:06

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ పెళ్లి వేడుకల కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ చిత్రంపై దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ, చిత్రం దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని, ఈ చిత్రం కచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు.

08/11/2016 - 21:05

‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ల దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి ఆ మధ్య అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇద్దరూ ఖరారు చేస్తూ, తమ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలియజేశారు. అయితే- ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

08/11/2016 - 21:03

సినీ థియేటర్ల షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న సినిమాల్ని ప్రోత్సహించేందుకు ఈ నెలాఖరునుంచి థియేటర్లలో ఐదు ఆటలకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్దినేని రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.

08/11/2016 - 21:02

ప్రతీక్, శ్రావ్య, శ్రీసయ్యని ప్రధాన తారాగణంగా రాహుల్ ఫ్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న ‘వానవిల్లు’కు సంబంధించి కేరళ షెడ్యూల్ పూర్తిచేశారు.

08/11/2016 - 21:01

హాస్యనటుడు అలీ కథానాయకుడిగా నాగూ గవర (వీకెండ్ లవ్ ఫేం) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ‘సంజయ్ రామస్వామి’ అనే పేరును ఖరారు చేశారు. సూర్య నటించిన ‘గజని’ చిత్రంలో కథానాయకుడి పేరు సంజయ్ రామస్వామి. ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌గా ‘గజని’ పేరును నిర్ణయించడం సరికొత్త ఉంటుందని దర్శకుడు తెలిపారు.

08/11/2016 - 20:59

ఉదయ్, స్వప్న జంటగా రూపొందించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’. హారిక కల్లూరి రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ కల్లూరి మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాము మూడేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపామని, దీన్ని కెనడాలో చిత్రీకరించడంతో లుక్ సరికొత్తగా వుంటుందని తెలిపారు.

08/11/2016 - 20:57

పూజిత, ధీరేంద్ర జంటగా షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీగేమ్’. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంలో సస్పెన్స్, రొమాన్స్ గేమ్‌గా ఇది రూపొందుతోందని, ఈ ఆట ఎవరు ఆడారు? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు?

08/11/2016 - 20:57

ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దీనికి యు/ఎ సెన్సార్ సర్ట్ఫికెట్ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

Pages